AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Sarja: హీరో అర్జున్ సర్జా ఇంట పెళ్లి సందడి.. కూతురి హాల్దీ వేడుకలలో తండ్రి ఎమోషనల్ మూమెంట్స్..

ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. ఇదిలా ఉంటే ఐశ్వర్య, ఉమాపతి ఇద్దరిది లవ్ మ్యారేజ్. కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఇదే విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇరు కుటుంబసభ్యులు. గతేడాది అక్టోబర్ లో వీరి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి.

Arjun Sarja: హీరో అర్జున్ సర్జా ఇంట పెళ్లి సందడి.. కూతురి హాల్దీ వేడుకలలో తండ్రి ఎమోషనల్ మూమెంట్స్..
Aishwarya Arjn
Rajitha Chanti
|

Updated on: Jun 09, 2024 | 6:39 AM

Share

యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అర్జున్ పెద్ద కూతురు హీరోయిన్ ఐశ్వర్య వివాహం జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో కమెడియన్ తంబి రామయ్య కొడుకు యంగ్ హీరో ఉమాపతితో జరగనుంది. ఇప్పటికే వివాహనికి సంబంధించిన హల్దీ, మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో అర్జున్ సర్జా తన కూతురిని ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటూ కనిపించాడు. ఇదిలా ఉంటే ఐశ్వర్య, ఉమాపతి ఇద్దరిది లవ్ మ్యారేజ్. కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. ఇదే విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇరు కుటుంబసభ్యులు. గతేడాది అక్టోబర్ లో వీరి నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఇప్పుడు వీరిద్దరి వివాహం జూన్ 10న చెన్నైలోని హనుమాన్ ఆలయంలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగనుంది. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకప్పుడు అర్జున్ నటించిన చిత్రాలు తెలుగులోకి డబ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. హీరోగానే కాకుండా సహాయ నటుడిగా.. ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్‍గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆమెకు ఆశించినంతగా సక్సెస్ కాలేదు. ఇప్పటివరకు ఐశ్వర్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయాయి. అలాగే తండ్రి డైరెక్షన్లో సినిమా చేసినా ఊహించినంత ఫలితం రాలేదు.

ఇక ఐశ్వర్యకు కాబోయే భర్త ఉమాపతి ఇప్పుడిప్పుడే హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నాడు. మనియార్ కుటుంబం, తిరువనం, థానే వాడి, అడగప్పట్టత్తు మనజనంగళే వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే ఉమాపతి చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు సినీ ప్రముఖులు, అభిమానులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.