Tollywood: చిన్నప్పుడు సీత వేషం వేసి తండ్రి చేతిలో చావు దెబ్బలు.. ఇప్పుడు ఫేమస్ యాక్టర్.. ఎవరంటే?
తమ పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి వెళతామంటే పేరెంట్స్ ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ కలల ప్రపంచంలో నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. అందుకే బుద్ధిగా చదువుకుని ఏదో ఉద్యోగం చేసుకోమంటారు. ఈ పాన్ ఇండియా నటుడికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
సినిమా ఇండస్ట్రీలోకి రావాలని చిన్నప్పటి నుంచే కలలు కంటారు చాలా మంది. కానీ అందుకు ఫ్యామిలీ సపోర్టు కూడా ఉండాలి. ఈ నటుడు కూడా చిన్నప్పుడే నటనపై మనసు పారేసుకున్నాడు. కానీ ఇది అతని తండ్రికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఒకసారైతే అతనిని విపరీతంగా కొట్టి చర్మం ఒలిచేశాడట. ఒక నాటకంలో చీర కట్టుకుని సీత వేషం వేసినందుకు బెల్టుతో చర్మం ఊడిపోయేలా కొట్టాడట. అంతే ఆరోజే ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ముంబై వెళ్లిపోయి సినిమాల్లో అవకాశాల కోసం తిరిగాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ట్యాలెంటెడ్ నటుడిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు. అతను మరెవరో కాదు అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమాలో మద్దాలి శివారెడ్డిగా నటించి మెప్పించిన భోజ్ పురి నటుడు రవి కిషన్. ప్రస్తుతం సినిమాలతో పాటు ఎంపీగా ప్రజలకు సేవ చేస్తున్నారాయన. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవి కిషన్ తన చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు.
‘మా ఊరిలో రామ్‌లీలా అనే నాటకం వేసేవారు. నేను అందులో సీతలా నటించేవాడిని. ఇందుకోసం నేను మా అమ్మ చీర తీసుకెళ్లి దానితో రోజంతా రిహార్సల్ చేశాను. అయితే ఈ విషయం మా నాన్నకు లిసింది. అంతే ఇంటికి వెళ్లగానే మా నాన్న బెల్ట్ అందుకుని వాయించాడు. చర్మం ఊడిపోయేలా కొట్టాడు. దీంతో అదే రోజు రాత్రి రూ. 500 తో ఇంటి నుంచి పారిపోయి ముంబైకు వచ్చేశాను’ అని అప్పటి సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు రవికిషన్.
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో రవి కిషన్..
View this post on Instagram
స్వతహాగా భోజ్ పురి నటుడైన రవికిషన్ ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించాడు. రేసు గుర్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అతను కిక్ 2, సుప్రీమ్, లై, ఎన్టీఆర్ కథా నాయకుడు, సైరా నరసింహారెడ్డి, హీరో తదితర సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా మెప్పించారు. ప్రస్తుతం నందమూరి నటసింహా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు రవికిషన్. ఇక బీజేపీ నాయకుడైన అతను గోరఖ్ పూర్ ఎంపీగా సేవలు అందిస్తున్నారు.
రవి కిషన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి