AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: ఇదెందయ్యా… 8 నెలల్లో 42 కిలోలు తగ్గిన అజిత్.. వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పిన హీరో..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ క్రేజ్ గురించి తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన అజిత్.. సినిమా ప్రమోషన్లకు ఇప్పటికీ దూరంగానే ఉంటారు. అయినా ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్లలో పండగే. అయితే ఇటీవల కొన్నాళ్లుగా అజిత్ తన స్టైలీష్ లుక్ తో అభిమానులను ఫిదా చేస్తున్నారు. తాజాగా తన వెయిట్ లాస్ సీక్రెట్ పంచుకున్నారు.

Ajith Kumar: ఇదెందయ్యా... 8 నెలల్లో 42 కిలోలు తగ్గిన అజిత్.. వెయిట్ లాస్ సీక్రెట్ చెప్పిన హీరో..
Ajith Kumar
Rajitha Chanti
|

Updated on: May 16, 2025 | 8:19 PM

Share

కోలీవుడ్ హీరో అజిత్ గురించి తెలిసిందే. ఈ ఏడాది విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ బ్యాక్ టూ బ్యాక్ రెండు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు తన డ్రీమ్ అయిన కారు రేసింగ్ లో పాల్గొని అద్భుతమైన విజయాలు సాధించి భారతదేశానికి గర్వకారణం అయ్యారు. ఈ ఏడాది మొదటి నాలుగు నెల్లలో అభిమానులకు ఆశ్చర్యకమరైన విషయాలు అందించారు అజిత్. అలాగే భారతదేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ అవార్డు సైతం అందుకున్నారు. సాధారణంగా ఎప్పుడూ బయట కనిపించని అజిత్.. చాలా కాలం తర్వాత తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా చెన్నైలోని చేపాక్ స్టేడియంలో తన కుటుంబంతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లు చూడటానికి వచ్చారు. ఇక ఇప్పుడిప్పుడే వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన పర్సనల్ విషయాలను పంచుకుంటున్నారు.

ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చిత్రీకరణలో పాల్గంటున్నారు అజిత్. మరోవైపు కార్ రేసుల్లో పాల్గొనడంపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బరువు తగ్గడం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. అజిత్ మాట్లాడుతూ.. ‘నేను మళ్ళీ రేసులో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పుడు ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఆగస్టు 2024 నుండి ఇప్పటివరకు 8 నెలల్లో నేను 42 కిలోలు తగ్గాను. తక్కువ తినడం, సరైన ఆహారం తీసుకోవడం, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేశాను. నాకు ఎలాంటి అలవాట్లు లేవు. నేను పూర్తిగా శాఖాహార ఆహారానికి మారాను. నేను రేసులో పాల్గొనడానికి ఫిట్‌గా ఉండాలనే కోరికతోనే ఇదంతా చేశాను’ అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ AK 64 గురించి కూడా ఒక అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ నెలలో ప్రారంభమై వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుందని తెలిపారు. అయితే దర్శకులు, హీరోయిన్ గురించి వివరాలు తెలియజేయలేదు. అజిత్ నెక్ట్స్ మూవీని హీరో ధనుష్ దర్శకత్వం వహించనున్నట్లు టాక్ నడుస్తుంది.

ఇవి కూడా చదవండి :  

 Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?

Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..

Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..

Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‏తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..