7/G Brundavan Colony: దొరికేసిందిరోయ్.. 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ హీరోయిన్గా మలయాళీ బ్యూటీ..
తెలుగు సినీరంగంలో ఎన్నో ప్రేమకథలు సూపర్ హిట్ అయ్యాయి. అందమైన లవ్ స్టోరీస్ వెండితెరపైకి తీసుకువచ్చారు నిర్మాత ఏఎం రత్నం. పెద్దరికం, కర్తవ్యం, భారతీయుడు, ఒకే ఒక్కడు, 7/G బృందావన్ కాలనీ వంటి హి్ట చిత్రాలను నిర్మించారు. ఇక ఇప్పుడు 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ తీసుకురాబోతున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో 7/G బృందావన్ కాలనీ ఎవర్ గ్రీన్ హిట్ మూవీ. కోలీవుడ్ హీరో ధనుష్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2004లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే రవికృష్ణ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమానే అయినప్పటికీ రవికృష్ణ యాక్టింగ్ కు అప్పట్లో కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇక ఇందులో రవి సరసన సోనియా అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ, యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక రెండు దశాబ్దాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తీసుకురాబోతున్నారు మేకర్స్.
గతంలో మొదటి చిత్రానికి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్.. మరోసారి సీక్వెల్ కు డైరెక్షన్ చేయనున్నారు. ఇక ఎప్పటిలాగే ఈ చిత్రంలో రవికృష్ణ కథానాయకుడిగా కనిపించనున్నారు. అయితే హీరోయిన్ ఎవరన్న విషయంపై కొంతకాలంగా సస్పెన్స్ కొనసాగుతుంది. లవ్ టుడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఇవానా ఈ చిత్రంలో నటించనున్నట్లు టాక్ వచ్చింది. అలాగే డైరెక్టర్ శంకర్ తనయ అదితి శంకర్ పేరు సైతం తెరపైకి వచ్చింది. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ఎవరనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఓ మలయాళీ హీరోయిన్ పేరు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఆమె మరెవరో కాదు.. మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయినా .. మలయాళీ సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. మలయాళంలో అనేక చిత్రాల్లో నటించింది. ఈ ఏడాది విడుదలైన రేఖా చిత్రం అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. గ్లామర్ షో చిత్రాలు కాకుండా విభిన్న కంటెంట్ సినిమాలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది అనస్వర రాజన్. ఇప్పుడు 7/G బృందావన్ కాలనీ సీక్వెల్ లో అవకాశం అందుకున్నట్లు టాక్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




