Soundharya: ఆ దేవుడు.. సౌందర్యను వదిలేసి నన్ను తీసుకెళ్లినా బాగుండు.. సీనియర్ హీరోయిన్ కన్నీళ్లు..
సినీరంగంలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన హీరోయిన్ సౌందర్య. అందం, అభియనయంతో సినీప్రియులను కట్టిపడేసింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూనే అద్భుతమైన నటనతో టాప్ హీరోయిన్గా కొన్నేళ్లు ఇండస్ట్రీని ఏలేసింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయింది.

సౌందర్య.. సినీప్రియుల హృదయాల్లో చెరగని రూపం. ఒకప్పుడు భారతీయ సినీ పరిశ్రమను ఏలేసిన హీరోయిన్. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే సంప్రదాయ పద్దతిలో కనిపిస్తూ పాత్రకు ప్రాణం పోసింది. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయింది. అందం, అభినయంతో కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనుహ్యంగా విమాన ప్రమాదంలో మరణించారు సౌందర్య. 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్యతోపాటు ఆమె సోదరుడు సైతం కన్నుమూశారు. దక్షిణాది చిత్రపరిశ్రమకు సౌందర్య మరణం తీరని లోటు. ఆమె ఆకస్మిక మరణంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాకయ్యింది. ఇప్పటికీ సౌందర్యను ఆరాధించే అభిమానులు ఉన్నారు. అయితే సౌందర్య మరణాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు ఓ సీనియర్ హీరోయిన్. ఆ దేవుడు సౌందర్యకు బదులుగా తనను తీసుకెళ్లినా బాగుండు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె మరెవరో కాదు.. సీనియర్ హీరోయిన్ ఆమని.
ఇండస్ట్రీలో సౌందర్య, ఆమని బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. చాలా సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. సౌందర్యతో తనకున్న అనుబంధం గురించి ఇదివరకు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు ఆమని. తాజాగా కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్న ఆమని.. మరోసారి సౌందర్యను గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఇండస్ట్రీలో తన బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య మాత్రమే అని.. ఆమె చనిపోయిన తర్వాత మళ్లీ అంతగా క్లోజ్ అయిన హీరోయిన్ ఎవరూ లేరని అన్నారు.
సౌందర్య చనిపోయిందనే వార్త తెలియగానే తన గుండె ఆగిపోయినంత పని అయ్యిందని.. ఆ దేవుడు సౌందర్యను వదిలేసి తనను తీసుకెళ్లినా బాగుండు అని అనుకున్నానని.. సౌందర్య అంటే తనకు చాలా ఇష్టమని చెబుతూ ఎమోషనల్ అయ్యారు ఆమని. కొన్నాళ్లపాటు సినిమాల్లో కథానాయికగా నటించిన ఆమని.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్లకు తల్లిగా నటిస్తున్నారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




