AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Ajith: అలా పిలవడం నాకు ఇబ్బందిగా ఉంది.. అభిమానులకు స్టార్ హీరో రిక్వెస్ట్..

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తన అభిమానుల కోసం ఓ లేఖ విడుదల చేశారు. తనను ఫ్యాన్స్ పిలుస్తున్న ఓ పిలుపు ఇబ్బంది పెడుతుందని చెప్పాడు.

Actor Ajith: అలా పిలవడం నాకు ఇబ్బందిగా ఉంది.. అభిమానులకు స్టార్ హీరో రిక్వెస్ట్..
Ajith
Rajitha Chanti
|

Updated on: Dec 11, 2024 | 11:55 AM

Share

తమిళ చిత్రపరిశ్రమలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో అజిత్. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ఈ హీరో. కానీ తనను అభిమానులు దేవుడు అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉందని.. అలా పిలవవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు అజిత్ ఓ ప్రకటన విడుదల చేశారు. “ఇటీవల ముఖ్యమైన కార్యక్రమాల్లో, ఈవెంట్లలో నేను కనిపించినప్పుడు అనవసరంగా నన్ను కడవులే అజిత్ (దేవుడు అజిత్) అంటూ పలువురు స్లోగన్స్ చేస్తున్నారు. ఆ పిలుపులు నన్ను ఎంతగానో ఇబ్బందిపెడుతున్నాయి. నా పేరుకు ఇతర బిరుదులను తగిలించడం నాకు నచ్చడం లేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. ఇకపై ఇలాంటివాటిని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను. ఇతరులను ఇబ్బందిపెట్టకుండా హార్ట్ వర్క్ తో జీవితంలో ముందుకు సాగండి. కుటుంబాన్ని ప్రేమించండి ” అంటూ అజిత్ పేర్కొన్నాడు.

అజిత్ ఇలా తన అభిమానులకు రిక్వెస్ట్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన తనను స్టార్ ట్యాగ్స్ వద్దని విజ్ఞప్తి చేశారు. తనను అజిత్ లేదా ఏకే అని పిలవాలని కోరారు. అలాగే అజిత్ ఎక్కువగా సినీ ఈవెంట్లలో కనిపించడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఈ హీరోకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటాడు.

ఇక అజిత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.మిజిల్ తిరుమేణి దర్శకత్వంలో విడతిల అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్, త్రిష, ఆరవ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది. ఆ తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, ప్రసన్న, అర్జున్ తదితరులు సపోర్టింగ్ రోల్స్ పోషిస్తున్నారు. మరోవైపు అజిత్ కార్ రేసింగ్ లో పాల్గొంటున్నారు.

అజిత్ ట్వీట్.. 

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.