AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: ఇది కదా సమంత క్రేజ్‌.. సిటడెల్‌ కోసం ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా.?

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు గడుస్తోన్నా ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతోంది నటి సమంత. అనతి కాలంలోనే నటిగా అగ్ర స్థానానికి చేరుకుంది. సైత్‌ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. పుష్పలో ఐటెం సాంగ్‌తో బాలీవుడ్‌ తళుక్కుమంది...

Samantha: ఇది కదా సమంత క్రేజ్‌.. సిటడెల్‌ కోసం ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా.?
Samantha
Narender Vaitla
|

Updated on: Jun 13, 2023 | 8:55 AM

Share

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు గడుస్తోన్నా ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతోంది నటి సమంత. అనతి కాలంలోనే నటిగా అగ్ర స్థానానికి చేరుకుంది. సైత్‌ ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. పుష్పలో ఐటెం సాంగ్‌తో బాలీవుడ్‌ తళుక్కుమంది. అలాగే ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తోనూ హిందీ ప్రేక్షకులను మెప్పించింది. దీంతో సామ్‌ పేరు బీ టౌన్‌లో మారుమోగింది. వరుస ఆఫర్లు ఈ బ్యూటీకి క్యూకట్టాయి. తాజాగా సిటడెల్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇండియాలో షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇప్పుడు విదేశాలకు వెళ్లింది. ఇదిలా ఉంటే హాలీవుడ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ లీడ్‌ రోల్‌లో ప్రియాంక చోప్రా నటించిన విషయం తెలిసిందే. ఇండియన్‌ వెర్షన్‌లో సమంత, వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇక ఇంతటి ప్రతిష్టాత్మక వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సామ్‌ తీసుకున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

సిటడెల్ వెబ్‌ సిరీస్‌ కోసం సమంత ఏకంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుందని టాక్‌ వినిపిస్తోంది. సాధారణంగా సౌత్‌ మూవీస్‌కు రూ. 4 నుంచి 5 కోట్లు తీసుకునే సమంత సిటడెల్‌ కోసం తన రెమ్యునరేషన్‌ను ఏకంగా డబుల్‌ చేసినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్‌ అగ్ర కథానాయికలతో సమానంగా సమంత రెమ్యునరేషన్‌ తీసుకుంటోందని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సిటడెల్ చిత్ర యూనిట్ ప్రస్తుతం.. సెర్బియాలో షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..