‘ఓ బేబీ’ మూవీని తిలకించిన తెలంగాణ గవర్నర్‌

హైదరాబాద్‌:  టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జులై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ వీక్షించారు. రామానాయుడు స్టుడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని చూశారు.  ఈ చిత్రంలో నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:02 pm, Tue, 6 August 19
'ఓ బేబీ' మూవీని తిలకించిన తెలంగాణ గవర్నర్‌

హైదరాబాద్‌:  టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. జులై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ వీక్షించారు. రామానాయుడు స్టుడియోలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సినిమాని చూశారు.  ఈ చిత్రంలో నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, రాజా రవీంద్ర తదితరులు ప్రధాన పాత్రలో నటించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్షరీ సంయుక్తంగా నిర్మించాయి.