ప్రొడ్యూసర్ ఆఫీస్ ముందు హంగామా చేసిన మహిళ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చివరకు

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాసును ఓ మహిళా గదా కొన్ని నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. సునీత బోయ అనే మహిళా బన్నీ వాసును సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురిచేస్తుంది.

ప్రొడ్యూసర్ ఆఫీస్ ముందు హంగామా చేసిన మహిళ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చివరకు
Bunny Vaas
TV9 Telugu Digital Desk

| Edited By: Rajeev Rayala

Jul 15, 2021 | 6:04 AM

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ను ఓ మహిళ గత కొన్ని నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. సునీత బోయ అనే మహిళ బన్నీ వాస్ ను సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురిచేస్తుంది. అంతటితో ఆగకుండా ఏకంగా గీత ఆర్ట్స్ ఆఫీస్ వద్దకు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఈ మహిళ బన్నీ వాసును పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది. బన్నీ వాసు తనకు సినిమాల్లో అవకాశం ఇస్తానని మోసం చేశాడంటూ ఆరోపించింది. అంతే కాదు పలుమార్లు పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్ళింది. అలాగే పలుసార్లు గీత ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లి నానా హంగామా చేసింది. ఆసమయంలో ఆమెపై గీతాఆర్ట్స్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెను అదుపులోకి తీసుకొని న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఆమె మానసిక స్థితి సరిగాలేదని తేలడంతో ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ ఆమెను చేర్పించారు. ఇటీవలే సునీత బయటకు వచ్చింది.

అయితే ఆమె మళ్లీ బన్నీ వాస్ పై ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. జూన్ రెండో వారంలో బన్నీ ఆఫీస్ ముందు సూసైడ్ చేసుకుంటాను అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో అప్రమత్తం అయిన బన్నీ వాస్ ఆఫీస్ సిబ్బంది ముందుగానే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఆమె అక్కడికి చేరుకోగానే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. అయితే సునీత మానసిక స్థితి ఇంక మెరుగుపడలేదని ఆమెను ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ చేర్పించి కౌన్సిలింగ్ ఇప్పించాలని న్యాయమూర్తి తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన హీరోయిన్.. ఎవరో తెలుసా..

Premi Vishwanath: “కార్తీక దీపం” సీరియల్‏కు నో చెప్పా.. వంటలక్క సంచలన వ్యాఖ్యలు..

Rajini Kanth: “అన్నాతే” కంప్లీట్ చేయడానికి కోల్‏కత్తాలో అడుగుపెట్టిన రజినీ.. సూపర్ స్టార్ ఫైనల్ షెడ్యూల్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu