IFFK: కరోనా నిబంధనలతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు… ఎప్పటి నుంచి అంటే..

 International Film Festival of Kerala: కరోనా కల్లోలం తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. జన జీవనం తిరిగి గాడిన పడుతుంది. ఈ నేపథ్యంలో కేరళలో సాధారణంగా..

IFFK: కరోనా నిబంధనలతో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు... ఎప్పటి నుంచి అంటే..
Kerala Film Festival
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2021 | 9:52 AM

International Film Festival of Kerala: కరోనా కల్లోలం తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. జన జీవనం తిరిగి గాడిన పడుతుంది. ఈ నేపథ్యంలో కేరళలో సాధారణంగా నవంబర్-డిసెంబర్లలో నిర్వహించే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళను నిర్వహించడానికి ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే ఈసారి ఫిబ్రవరి 4 వతేదీ నుంచి ఫిబ్రవరి  11 వరకూ జరుగుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి సాజీ చెరియన్  తెలిపారు. ఈ ఉత్సవాలను కేరళ రాజధానిలోని నిశాగాంధీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించనున్నారని చెప్పారు.

1996లో ప్రారంభమైన IFFKని రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల విభాగం తరపున కేరళ రాష్ట్ర చలనచిత్ర అకాడమీ నిర్వహిస్తుంది. COVID-19 మహమ్మారి సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పండుగను నిర్వహించిందని మంత్రి చెరియన్ అన్నారు. “తదుపరి ఎడిషన్‌ను అత్యంత వైభవంగా నిర్వహించాలని తమ ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు.  ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌లో 12 థియేటర్లు వేదికలుకానున్నాయి.

అంతేకాకుండా, జూలై లో జరగాల్సిన 13వ అంతర్జాతీయ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ను మళ్ళీ  నిర్వహించనున్నామని చెప్పారు. IDSFFK ఫెస్టివల్ ను డిసెంబర్ 9 వ తేదీన ప్రారభించి డిసెంబర్  14  వరకూ ఆరు రోజుల పాటు నిర్వహించనున్నామని చెప్పారు. ఈ ఉత్సవాలను డిసెంబర్ 9న సీఎం విజయన్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని..  కోవిడ్ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Also Read:  సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. చికెన్‌తో పోటీపడుతున్న టమాటా.. కిలో వందకు చేరువలో..