2018 movie : చిన్న సినిమా ప్రభంజనం.. పదిరోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్స్.. అసలైన కేరళ చిత్రం ఇదే..
ముఖ్యంగా కేరళలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో వచ్చిన రోమాంచం సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. నామమాత్రపు ఖర్చుతో రూపొందించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు కేరళలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీగా వసూళ్లు రాబడుతున్న లేటేస్ట్ చిత్రం 2018. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహకందని రీతిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది.

గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల తెలుగులో డైరెక్టర్ వేణు యెల్దండి తెరకెక్కించిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. కేవలం టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్.. మాలీవుడ్ ఇండస్ట్రీలలో సైతం చిన్న సినిమాలు పెద్ద విజాయన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా కేరళలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. గతంలో వచ్చిన రోమాంచం సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. నామమాత్రపు ఖర్చుతో రూపొందించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు కేరళలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీగా వసూళ్లు రాబడుతున్న లేటేస్ట్ చిత్రం 2018. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహకందని రీతిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
ఈ సినిమా మే5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన పది రోజుల్లోనే రూ. 44 కోట్లకు పైగా గ్రాస్ అందుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం రూ. 52.20 కోట్లు రేంజ్ గ్రాస్ సొంతం చేసుకుంది. ఈచిత్రం ఓవర్సీస్ లోనూ ఇతర మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. 48 కోట్ల రేంజ్ లో గ్రాస్ సొంతం చేసుకోవడమే కాకుండా విడుదలైన 11 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రామ్ మార్క్ ను క్రాస్ చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం పదిరోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అయితే ఈ సినిమాకు మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. అయితే సినిమా బాగుండడంతో సూపర్ రెస్పాన్స్ వస్తుంది.




2018లో కేరళను అతలాకుతలం చేసిన వరదలలో వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. యాదార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ జూడ్ ఆంథనీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సామాన్యుడు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్. ఇందులో తొవినో థామస్ కీలక పాత్రలో నటించాడు.




