Vikrant Massey: షాకింగ్ నిర్ణయం తీసుకున్న 12th ఫెయిల్ హీరో.. నిరాశలో అభిమానులు
నటుడు విక్రాంత్ మాస్సే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నటనకు గుడ్ బై చెప్పాడు. ఈ నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 37 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడు.? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
చాలా మంది హీరోలు ఎదో ఒక టైంలో సినిమాలకు గుడ్ బై చెప్తూ ఉంటారు. తాజాగా ఓ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన నటుడు విక్రాంత్ మాస్సే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నటనకు గుడ్ బై చెప్పాడు. ఈ నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 37 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడు.? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. బాలీవుడ్ హీరో విక్రాంత్ ఎన్నో సినిమల్లో నటించి మెప్పించాడు. రీసెంట్ గా 12th ఫెయిల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 12th ఫెయిల్ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సడన్ గా సినిమాలకు గుడ్ బై చెప్తున్నా అని అనౌన్స్ చేశాడు.
అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..
ఈ విషయాన్ని విక్రాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘గత కొన్నేళ్లు బాగానే ఉన్నాయి. నిత్యం నాకు మద్దతు ఇచ్చిన నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కానీ నేను సినిమాల ద్వారా మీ ముందుకు రావడంకంటే.. కొడుకుగా, భర్తగా, తండ్రిగా ఇంటికి తిరిగి రావడానికి ఇదే సరైన సమయమని గ్రహించాను’ అని పోస్ట్ చేశాడు. దీంతో రానున్న రోజుల్లో కుటుంబంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు విక్రాంత్.
16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..
2025లో చివరిసారిగా కలుసుకుందాం. ముందు కొన్ని సినిమాలు, చాలా సంవత్సరాల జ్ఞాపకాలు. మళ్ళీ ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని రాశారు. ప్రస్తుతం ఈ విషయం చాలా మందికి షాకిస్తోంది. ఈ పోస్ట్ తో అభిమానులకు ఎలా స్పందించాలో తెలియడం లేదు. ‘నువ్వు నా ఫేవరెట్ హీరో’ అన్నారు కొందరు. మీరు తిరిగి వచ్చే వరకు మేము వేచి ఉంటాము’ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘మీరు భారతదేశపు అద్భుతమైన నటుడు, దయచేసి వెళ్లవద్దు అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..