Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trigun: పేరు మార్చుకున్న ‘కొండా’ సినిమా హీరో.. కారణమేంటంటే..

సినిమా పరిశ్రమ (Cinema Industry) లో  సెంటిమెంట్లు (Sentiments), జాతకాలు, జ్యోతిష్యం, న్యూమరాలజీ (Numerology)కి ప్రాధాన్యం కొంచెం ఎక్కువే.

Trigun: పేరు మార్చుకున్న 'కొండా' సినిమా హీరో.. కారణమేంటంటే..
Follow us
Basha Shek

|

Updated on: Jan 26, 2022 | 11:40 AM

సినిమా పరిశ్రమ (Cinema Industry) లో  సెంటిమెంట్లు (Sentiments), జాతకాలు, జ్యోతిష్యం, న్యూమరాలజీ (Numerology)కి ప్రాధాన్యం కొంచెం ఎక్కువే. అందుకే సినిమా ఓపెనింగ్ ముహూర్తం దగ్గరి నుంచి సినిమా టైటిల్స్ వరకూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక గతంలో చాలామంది హీరోలు, హీరోయిన్లు తమ పేర్లు మార్చుకున్నారు. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ పేర్లు మార్చుకున్న తర్వాత విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి యంగ్ హీరో అదిత్ అరుణ్ చేరాడు.   తన పేరును మార్చుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

అందరూ నన్నే అలాగే పిలవండి..

‘వీకెండ్ లవ్’, ‘తుంగభద్ర’, ‘పీఎస్‌వీ గరుడవేగ’, ‘డియర్ మేఘ’, ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ వంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘కొండా’ సినిమాలోనూ ఇతనే హీరో. కాగా డిఫరెంట్ మూవీస్ తో ఆకట్టుకుంటోన్న అదిత్ అరుణ్.. సడెన్‌గా తన పేరును త్రిగుణ్‌గా మార్చుకున్నాడు. తన తాజా ట్వీట్‌లో ‘ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్..’ అంటూ  పోస్ట్ పెట్టాడు. అంతేకాదు తనను మీడియా మిత్రులు, చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, పెద్దలు త్రిగుణ్‌గా పిలవాలని కోరారు.  అయితే హీరోగా గుర్తింపు వస్తోన్న కమర్షియల్ గా భారీ విజయాలు అందుకోలేకపోతున్నాడీ యంగ్ హీరో. ఈ క్రమంలోనే తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Ananya Panday: చలికి తట్టుకోలేకపోయిన ‘లైగర్’ బ్యూటీ.. యంగ్ హీరో చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

Coronavirus: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది వైరస్ బారిన పడ్డారంటే..

Petrol Diesel Price: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..