AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: సూపర్​స్టార్ రజినీకాంత్‌​ సినిమాకు నో చెప్పిన టాలీవుడ్​ స్టార్ హీరో!

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించాలని హీరోయిన్లే కాదు, హీరోలు కూడా ఎదురుచూస్తుంటారు. తమిళంలోనే కాదు సౌత్‌లోని అన్ని భాషల్లో కూడా ఆయన స్టైల్‌కు అభిమానులు ఉన్నారు. ఒక్క చాన్స్ వస్తే రజినీకాంత్ సరసన నటించాలని ప్రతి నటుడు ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే ..

Rajinikanth: సూపర్​స్టార్ రజినీకాంత్‌​ సినిమాకు నో చెప్పిన టాలీవుడ్​ స్టార్ హీరో!
Rajinikanthh
Nikhil
|

Updated on: Nov 18, 2025 | 2:41 PM

Share

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ సినిమాలో నటించాలని హీరోయిన్లే కాదు, హీరోలు కూడా ఎదురుచూస్తుంటారు. తమిళంలోనే కాదు సౌత్‌లోని అన్ని భాషల్లో కూడా ఆయన స్టైల్‌కు అభిమానులు ఉన్నారు. ఒక్క చాన్స్ వస్తే రజినీకాంత్ సరసన నటించాలని ప్రతి నటుడు ఆశగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఆయన సినిమాలో నటించే ఆఫర్‌‌ను టాలీవుడ్ హీరో రిజెక్ట్ చేశారని టాక్ వినిపిస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’గా పేరుపొందిన నందమూరి బాలకృష్ణ, ప్రస్తుతం వరుస హిట్లతో కెరీర్ పీక్స్‌లో ఉన్నారు. వరుసగా నాలుగు సినిమాలు అఖండ, వీరసింహారెడ్డి, భైరవ, డాకు మహారాజ్ ఘన విజయం సాధించడంతో పాటు, పద్మశ్రీ అవార్డు, హ్యాట్రిక్ ఎమ్మైల్యే ఘనత, అన్​స్టాపబుల్​ విత్ ఎన్​బికే హోస్టింగ్‌.. ఇలా ఏది పట్టుకున్నా తిరుగులేకుండా రాణిస్తున్నారు.

ఇక పాన్​ ఇండియా రేంజ్​లో ఉన్న బాలయ్య క్రేజ్ వల్ల ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు క్యూకడుతున్నాయి. గెస్ట్ రోల్స్‌లోనైనా నటించేందుకు బాలయ్యను ఒప్పించడానికి బాలీవుడ్, కోలీవుడ్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. కానీ, 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో బాలయ్య టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమై, ఇతర ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు.

ఓన్లీ టాలీవుడ్​..

తన సమకాలీనులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లు తమిళం, హిందీలో సినిమాలు చేసి పాన్-ఇండియా ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుత తరంలో మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు హిందీ మార్కెట్‌లో విజయవంతంగా రాణిస్తున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం హైదరాబాద్‌ను దాటి వెళ్లకుండా, తెలుగు సినిమాల్లోనే దూసుకెళ్తున్నారు. తనకు తెలుగు సినిమాయే చాలు, కష్టాలు-నష్టాలు తాను తీర్చుకుంటానన్న మనస్తత్వంతో ముందుకు సాగుతున్నారు.

పుట్టి పెరిగింది చెన్నైలోనే అయినా, తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉన్నా, తమిళంలో అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఉన్నా, కోలీవుడ్ వైపు కన్నెత్తలేదు బాలయ్య. పలువురు తమిళ దర్శక-నిర్మాతలు సంప్రదించినా, బాలయ్య ఆ ఆఫర్లను సున్నితంగా తిరస్కరించారు.

జైలర్​ 2కి నో..

అయితే, ఇటీవల కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో బాలయ్య గెస్ట్ రోల్ గురించి వార్తలు వచ్చాయి. రజనీకాంత్‌తో నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ (2023) బాక్సాఫీస్ వద్ద రూ.650 కోట్లు సాధించి, సూపర్‌హిట్ అయింది. మోహన్‌లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ గెస్ట్ రోల్స్‌తో సినిమా విజయవంతమైంది. జైలర్‌కు ప్రీక్వెల్‌గా ‘జైలర్ 2’ని తెరకెక్కిస్తానని నెల్సన్ ప్రకటించారు.

2025 సంక్రాంతికి పోస్టర్ రిలీజ్ చేసి, 2026 సమ్మర్‌కు రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో బాలయ్యకు పవర్‌ఫుల్ రోల్ ఆఫర్ చేసి, రోజుకు రూ.2.5 కోట్లు చొప్పున 20 రోజులకు రూ.50 కోట్లు పారితోషికం ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. మొదట బాలయ్య ఓకే చెప్పి, డేట్స్ కూడా ఇచ్చినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

కానీ, ‘జైలర్ 2’లో బాలయ్య నటించడం లేదంటూ ఓ వార్త హల్​చల్ చేస్తోంది. ఆ రోల్ రజనీకాంత్ పాత్రను ఎలివేట్ చేసేలా ఉండటంతో, బాలయ్య మనసు మార్చుకున్నారని. వరుస విజయాలతో జోరులో ఉన్న టైంలో గెస్ట్ రోల్స్ వద్దని అనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఫ్యాన్స్ కూడా, తమ హీరోని సపోర్టింగ్ రోల్‌లో చూడడాన్ని అంగీకరించకపోవచ్చని భావిస్తున్నారు. బాలయ్య ఈ నిర్ణయం మాస్టర్‌స్ట్రోకా, బ్లండరా అనేది జైలర్​ 2 రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే!