AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓటుహక్కును వినియోగించుకుంటున్న సినిమా తారలు..

సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, చిరంజీవి, రానా, వెంకటేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేరు వేరు ప్రాంతాల్లో వీరు ఓట్లు వేశారు. అల్లు అర్జున్ గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి సామాన్యుడిలా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు తారక్ కూడా కుటుంబసమేతంగా వచ్చి క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు

Telangana: ఓటుహక్కును వినియోగించుకుంటున్న సినిమా తారలు..
Movie Celebrities
Rajeev Rayala
|

Updated on: Nov 30, 2023 | 1:43 PM

Share

తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జోరుగా జరుగుతుంది. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, ఎన్టీఆర్, చిరంజీవి, రానా, వెంకటేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వేరు వేరు ప్రాంతాల్లో వీరు ఓట్లు వేశారు. అల్లు అర్జున్ గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి సామాన్యుడిలా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు తారక్ కూడా కుటుంబసమేతంగా వచ్చి క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారు. మరి కొంతమంది సెలబ్రెటీలు కూడా తమ ఓటు వినియోగించుకున్నారు.

నటుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌ రెడ్డి పబ్లిక్‌ స్కూలులోఓటు వేశారు. అందరితో పాటు క్యూలో నిలబడి మరీ ఓటు వేసిన ఎన్టీఆర్..ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. హీరో అక్కినేని నాగార్జున, అమల దంపతులు జూబ్లీహిల్స్‌లో తమ ఓటు హక్కును వినియోగిచుకున్నారు. అక్కడ ఉన్న క్యూలైన్‌లో నిల్చొని ఓటేశారు.. ఓటేసేందుకు వచ్చిన వారిని నాగార్జున పలకరించడం కనిపింది.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో హీరో వెంకటేశ్‌ తన ఓటు హక్కును వినియోగిచుకున్నారు.. Fnccలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. పాఠశాల విద్య నుంచే ఓటు విలువను తెలియజేయాలన్నారు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు. పిల్లల పాఠాల్లో ఓటును పాఠ్యంశంగా చేర్చాలని కోరిన ఆయన జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  హీరో రాజేంద్ర ప్రసాద్‌ తన కుటుంబంతో కలిసి వేటు వేసేందుకు వచ్చారు.. యువ హీరో విజయ్‌ దేవరకొండ జూబ్లీహిల్స్‌లోని పోలింగ్ స్టేషన్‌కు వచ్చి తన ఓటుహక్కును వినియోగిచుకున్నారు..

హైదరాబాద్‌లో హీరో నాని ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వచ్చారు.. అటు హీరో నాని కూడా తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. హీరో రవి తేజా, శివాజీ రాజా తదితరులు తమ ఓట్లను వేశారు.  సినీ నిర్మాతలు ఉత్సాహంగా ఓటు వేసేందుకు వచ్చారు. ప్రముఖ నిర్మాత రాజమౌళి ఓటు వేసి తన ఫోటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సుకుమార్‌ దంపతులు ఓటేశారు.. నిర్మాత బండ్ల గణేష్‌ నగరంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలగేహేరో రామ్, రవితేజ, గోపీచంద్ ఇలా చాలా మంది సినిమాతారలు తమ ఓటు  హక్కును వినియోగించుకుంటున్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న రవితేజ

ఓటు హక్కు వినియోగించుకున్న రామ్

ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్ దేవరకొండ

తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..

పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..