AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఐరెన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. స్టార్ హీరోలతో బ్లా్క్ బస్టర్ హిట్ మూవీస్ చేసింది. ముఖ్యంగా ఆమె నటనకు యావత్ సినీ ప్రపంచమే ఫిదా అయ్యింది. గ్లామర్ పాత్రలే కాదు.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది.

Tollywood : ఐరెన్ లెగ్ అన్నారు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
Ramya Krishna
Rajitha Chanti
|

Updated on: Jul 09, 2026 | 10:38 AM

Share

సినీరంగంలోకి నటిగా అడుగుపెట్టింది. కానీ కెరీర్ మొదట్లోనే ఐరన్ లెగ్ అన్నారు. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే తనదైన ఇంపాక్ట్ చూపించిన ఆమె..నటనలో సూపర్ స్టార్ రజినీకాంత్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక టైంలో రజినీ యాక్టింగ్, ఫాలోయింగ్ సైతం బీట్ చేసింది. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రమ్యకృష్ణ. అసలు పేరు అసలు పేరు రమ్య. ఆమె తండ్రి పేరు కృష్ణన్ కావడం వల్ల ఆమె ‘రమ్యకృష్ణ’గా మారారు. ఆమె కేవలం 13 సంవత్సరాల వయసులోనే తమిళ చిత్రం ‘వెళ్లై మనసు’ (వై.జి. మహేంద్రన్ హీరో) ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.. ఆ తర్వాత తెలుగులో చేసిన ‘భలే మిత్రులు’ మరికొన్ని సినిమాలు కూడా వరుసగా పరాజయం పాలయ్యాయి. ఆ సమయంలో ఇండస్ట్రీ ఆమెపై ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వేసింది. ఆమె సినిమాల్లో ఉంటే ఆ ప్రాజెక్ట్ ఫ్లాప్ అవుతుందంటూ ప్రచారం జోరుగా సాగింది.. ఒకానొక స్టేజ్ ఫంక్షన్‌లో తనను ఇలా ఐరన్ లెగ్ అనడంపై రమ్యకృష్ణ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

అయితే వరుస ప్లాపులతో ఇండస్ట్రీ ఆమెను పక్కన పెడుతున్న తరుణంలో, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆమెలోని నటిని, గ్లామర్‌ను గుర్తించారు. ఐరన్ లెగ్ అని ముద్రపడిన నటిని తన సినిమాలో పెట్టుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. రాఘవేంద్రరావు మోహన్ బాబు హీరోగా తీసిన ‘అల్లుడు గారు’ సినిమాలో రమ్యకృష్ణను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్ సాధించింది. ఆ తర్వాత రాజశేఖర్‌తో ఆయన తీసిన ‘అల్లరి ప్రియుడు’ కూడా బ్లాక్‌బస్టర్ అయ్యింది. నిన్నటివరకు ‘ఐరన్ లెగ్’ అన్న నోళ్లే, ఈ విజయాల తర్వాత ఆమెను ‘గోల్డెన్ లెగ్’ అని పిలవడం ప్రారంభించాయి. సక్సెస్ మాత్రమే ఇండస్ట్రీలో మాట్లాడుతుందని దీని ద్వారా మరోసారి నిరూపితమైంది.

రమ్యకృష్ణ కెరీర్‌లో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న ఎన్నో ఐకానిక్ పాత్రలు ఉన్నాయి: కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అమ్మోరు’ చిత్రంలో ఆమె అద్భుతమైన దైవిక నటనతో ప్రేక్షకులతో పూజలు అందుకునే స్థాయికి చేరారు. రజనీకాంత్‌కు పోటీగా ‘నరసింహ’ (పడయప్ప) చిత్రంలో ‘నీలాంబరి’ పాత్ర చేయడానికి చాలా మంది టాప్ హీరోయిన్లు భయపడ్డారు. కానీ రమ్యకృష్ణ ఆ అహంకారపూరితమైన పాత్రలో జీవించి, రజనీకాంత్‌తో సమానంగా ప్రశంసలు పొందారు. ఇక బాహుబలి సినిమాలో శివగామమి పాత్రలో రాజమాతగా ఆమె పలికించిన గంభీరత్వం, నటన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. ‘చంద్రలేఖ’, ‘అంతఃపురం’ వంటి సినిమాల్లో నటిస్తున్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తున్నారు రమ్యకృష్ణ.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

రమ్యకృష్ణ ఫోటో..

Ramya Krishna News

Ramya Krishna News

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

Follow Us
స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
స్టార్ హీరోలను మించిన ఫాలోయింగ్.. ఇప్పటికీ అదే క్రేజ్..
ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు..
ఇది నా అడ్డా.. ఇక్కడి నుంచి కదిలేది లేదు.. నడిరోడ్డుపై చుక్కలు..
స్కూల్ హాస్టల్‌లోకి చొరబడిన కట్లపాము,నిద్రలోనే కాటు వేసిన కాలనాగు
స్కూల్ హాస్టల్‌లోకి చొరబడిన కట్లపాము,నిద్రలోనే కాటు వేసిన కాలనాగు
భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో
భారత్ తొలి మ్యాన్ మిషన్‌కు కౌంట్‌డౌన్.. గగన్‌యాన్ టెస్ట్‌లో ఇస్రో
భారత్–ఆస్ట్రేలియా సమావేశం.. దేశ భద్రతకు మరింత బలం!
భారత్–ఆస్ట్రేలియా సమావేశం.. దేశ భద్రతకు మరింత బలం!
కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్‌..!
కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న సెకండాఫ్ క్యాలెండర్‌..!
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
గుండు హనుమంతరావు కొడుకును దత్తత తీసుకున్న స్టార్ ఎవరంటే..
ఇవాళే OTTకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
ఇవాళే OTTకి వచ్చేసిన రీసెంట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. 8.7 రేటింగ్
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి!విజిలెన్స్ రైడ్‌లో కళ్లుచెదిరే
రిటైర్డ్ ఏఆర్టీఓ ఇంట్లో కుబేర నిధి!విజిలెన్స్ రైడ్‌లో కళ్లుచెదిరే
ముంత మసాలా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేస్కోండి...
ముంత మసాలా ఇంట్లోనే పరిశుభ్రంగా ఇలా చేస్కోండి...