Virupaksha: రెడీగా ఉండండి.. టీవీల్లోకి వచ్చేస్తోన్న ‘విరూపాక్ష’.. ఎప్పుడు ఎక్కడంటే..
డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించారు. ఇక ఇందులో రాజీవ్ కనకాల, అజయ్, సునీల్, సోనియా సింగ్, రవికృష్ణ కీలకపాత్రలు పోషించారు.

ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో విరూపాక్ష ఒకటి. డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించారు. ఇక ఇందులో రాజీవ్ కనకాల, అజయ్, సునీల్, సోనియా సింగ్, రవికృష్ణ కీలకపాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యింది. త్వరలోనే స్టార్ మాలో ఈ సినిమా ప్రసారం కానుంంది.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం.. సాయి ధరమ్ తేజ్, సంయుక్త నటనపై ప్రేక్షకులే కాదు.. సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ మూవీలో సంయుక్త నటన అద్భుతమని.. ఆమె తన పాత్రతో ఆడియన్స్ ను కట్టిపడేందంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా… ప్రేక్షకులకు దాదాపు రెండున్నర గంటలపాటు థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్.
కథ విషయానికి వస్తే.. రుద్రవనం అనే ఊరి చుట్టూ సాగే కథే విరూపాక్ష. చేతబడి చేస్తూ చిన్న పిల్లల మరణానికి కారణమవుతున్నారంటూ దంపతులను చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేస్తారు ఊరి ప్రజలు. వారు మంటల్లో కాలిపోతూ పుష్కర కాలం తర్వాత ఈ ఊరు వల్లకాడు అవుతుందని శపిస్తారు. ఇక ఆ తర్వాత పన్నెండేల్ల తర్వాత ఆ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తాయి. దీంతో గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేస్తారు. అయినప్పటికీ మరణాలు ఆగవు. ఇక ఆ ఊరికి అతిథిగా వచ్చిన హీరో.. గ్రామం నుంచి వెళ్లకుండా ప్రేమ కోసం ఆగిపోతాడు. ఆ తర్వాత వరుస చావుల వెనక ఉన్న రహస్యాల్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి ?.. చివరకు పరిష్కారం కనుగొన్నాడా లేదా అనేది విరూపాక్ష కథ.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




