AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White vs Brown Rice: వైట్ లేదా బ్రౌన్ రైస్.. తర్వగా బరువు తగ్గేందుకు ఏది బెస్ట్!

White vs Brown Rice For Weight Loss: మనం ఏం తిన్నా, ఎంత తిన్నా.. అన్నం తినకపోతే భోజనం చేసిన సంతృప్తే ఉండదు. మన దేశంలో జనాలు రెండు రకాల రైస్‌ను తినేందుకు ఇష్టపడుతారు. అందులో ఒకటి వైట్ రైస్, మరొకటి బ్రౌన్ రైస్. అయితే, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి బ్రౌన్ రైస్ బెస్ట్ ఆప్షన్ అని మీరు చాలా సందర్భాల్లో వినే ఉంటారు. అలాగే వెయిట్‌ లాస్ డైట్‌లో ఉన్న వారు వైట్‌ రైస్ తినడాన్ని కూడా తగ్గిస్తారు. కాబట్టి బరువు తగ్గడానికి రెండింటిలో ఏది ఉత్తమంగా పనిచేస్తుందో.. వారు ఏది తినడం బెస్ట్‌ అనేది తెలుసుకుందాం.

White vs Brown Rice: వైట్ లేదా బ్రౌన్ రైస్.. తర్వగా బరువు తగ్గేందుకు ఏది బెస్ట్!
White Vs Brown Rice For Weight Loss
Anand T
|

Updated on: Feb 22, 2026 | 8:00 AM

Share

బ్రౌన్ రైస్ అనేది ఒక తృణధాన్యం. దీన్ని ఎక్కువగా పాలిష్ చేయరు కాబట్టి ఇందులో దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాని వైట్ రైస్ విషయానికి వస్తే దీన్ని ఎక్కవగా ప్రాసెస్ చేస్తారు. కాబట్టి వీటిపై ఉన్న పొరలన్ని తొలగిపోతాయి. ఇది బియ్యాన్ని మృదువుగా, చెడిపోకుండా నిరోధించేలా చేస్తుంది, కానీ పాలీష్ చేసినప్పుడు బియ్యం పై భాగంలో ఉన్న ఫైబర్, ఇతర పోషకాలు తొలగిపోతాయి. బ్రౌన్ రైస్‌లో చాలా తక్కువ కేలరీలు ఉంటాయని ప్రజలు తరచుగా అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఒక గిన్నెడు వండిన బ్రౌన్ రైస్‌లో తెల్ల బియ్యంతో సమానమైన కేలరీలు ఉంటాయి. రెండింటి మధ్యలో తేడా ఏమిటంటే.. బ్రౌన్ రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. దీని వల్ల మీకు త్వరగా ఆకలి వేయదు

బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ ఎలా సహాయపడుతుంది?

బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. అలాగే ఆకలి బాధలను నివారిస్తుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంకా, బ్రౌన్ రైస్ రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది. రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరిగి ఆపై తగ్గినప్పుడు, ఆకలి మొదలవుతుంది, కానీ బ్రౌన్ రైస్ నెమ్మదిగా శక్తిని అందిస్తుంది, ఇది ఆకస్మిక ఆకలి, కోరికలను తగ్గిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, బ్రౌన్ రైస్ మాత్రమే తినడం వల్ల బరువు తగ్గదు. సరైన ఆహారం, వ్యాయామం కూడా చాలా అవసరం.

వైట్‌ రైస్ ఎప్పుడూ చెడ్డవి కాదు

వైట్ రైస్ తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతామని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. తెల్ల బియ్యం సులభంగా జీర్ణమవుతుంది. అలాగే తక్షణ శక్తిని అందిస్తుంది. అనేక ఆసియా దేశాలలో, ప్రజలు ప్రతిరోజూ తెల్ల బియ్యం తింటారు. ఇప్పటికీ వారంతా ఆరోగ్యంగానే ఉంటారు. కారణం సరైన పరిమాణంలో, చురుకైన జీవనశైలి ఉంటే ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్లతో పాటు తెల్ల బియ్యం మితంగా తింటే, దానిని బరువు తగ్గించే ఆహారంలో కూడా చేర్చవచ్చు.

బరువు తగ్గేందుకు రెండింటిలో ఏది మంచిది?

మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే, బ్రౌన్ రైస్ మంచి ఎంపిక అవుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అయితే, తెల్ల బియ్యాన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి, పుష్కలంగా కూరగాయలు, ప్రోటీన్‌తో పాటు మితంగా తీసుకోవడం వల్ల మీరు బరువు తగ్గవచ్చు. అందువల్ల, రెండింటి మధ్య ప్రత్యామ్నాయంగా తినడం ఉత్తమం. తెల్ల బియ్యం నుండి బ్రౌన్ రైస్‌కి మారడం వల్ల బరువు తగ్గడం తప్పనిసరి కాదు. నిజమైన తేడా మీ రోజువారీ అలవాట్లు, జీవనశైలిపై ఆదారపడి ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us