AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Varma: తమన్నాతో డేటింగ్ అప్పుడే మొదలైంది.. విజయ్ వర్మ ఆసక్తికర కామెంట్స్..

ఆ తర్వాత ఓటీటీలో లస్ట్ స్టోరీస్ 2 లో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో అరణ్మణై 4, స్త్రీ 2 చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీలలో పాల్గొంటున్నారు. ఇక గతేడాది తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది మిల్కీ బ్యూటీ. కానీ పెళ్లి గురించి మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో వీరిద్దరి వెడ్డింగ్ ఎప్పుడు జరుగుతుంది ?.. అసలు చేసుకుంటారా ? అనే కామెంట్స్ వచ్చాయి.

Vijay Varma: తమన్నాతో డేటింగ్ అప్పుడే మొదలైంది.. విజయ్ వర్మ ఆసక్తికర కామెంట్స్..
Tamannah, Vijay Varma
Rajitha Chanti
|

Updated on: Mar 25, 2024 | 7:13 AM

Share

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పుడు హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. చివరిసారిగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత ఓటీటీలో లస్ట్ స్టోరీస్ 2 లో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో అరణ్మణై 4, స్త్రీ 2 చిత్రాల్లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఇండస్ట్రీలో జరిగే ఈవెంట్స్, పార్టీలలో పాల్గొంటున్నారు. ఇక గతేడాది తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది మిల్కీ బ్యూటీ. కానీ పెళ్లి గురించి మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దీంతో వీరిద్దరి వెడ్డింగ్ ఎప్పుడు జరుగుతుంది ?.. అసలు చేసుకుంటారా ? అనే కామెంట్స్ వచ్చాయి. తాజాగా నటుడు విజయ్ వర్మ తమన్నాతో డేటింగ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ వర్మ మాట్లాడుతూ.. లస్ట్ స్టోరీస్ 2 షూటింగ్ తర్వాత తమన్నాతో తన డేటింగ్ ప్రారంభమయ్యింది అన్నారు. అంతకు ముందు ఆంథాలజీ చిత్రంలోనూ వీరిద్దరు కలిసి నటించారు.

విజయ్ వర్మ మాట్లాడుతూ.. “లస్ట్ స్టోరీస్ 2 తర్వాతే మేము డేటింగ్ ప్రారంభించాము. ఆ సమయంలో ర్యాప్ పార్టీ జరగాల్సి ఉంది. కానీ జరగలేదు. దీంతో మేము నలుగురం పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలోనే తమన్నాకు అసలు విషయం చెప్పాను. నేను మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను అని ఆమెతో చెప్పాను. ఆ తర్వాత మేము కలవడానికి దాదాపు 20 నుంచి 25 రోజులు పట్టింది” అంటూ చెప్పుకొచ్చాడు. తమన్నా, విజయ్ వర్మ లస్ట్ స్టోరీస్ 2లో కలిసి కనిపించారు. దీనికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. వీరిద్దరు కలిసి న్యూఇయర్ పార్టీలో కనిపించారు.దీంతో వీరి ప్రేమాయణంపై రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి రెస్టారెంట్స్, ఈవెంట్లలో కనిపించడంతో డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది.

చాలా కాలం తర్వాత గతేడాది జూన్‌లో ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా విజయ్‌తో ఉన్న బంధాన్ని వెల్లడించింది. అప్పటి నుంచి వీరు సోషల్ మీడియాలో ఒకరి పోస్టులపై మరొకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. విజయ్ చివరిసారిగా మర్డర్ ముబారక్ చిత్రంలో కనిపించాడు. ప్రస్తుతం అతడు మట్కా కింగ్, మీర్జాపూర్ సీజన్ 3లో నటిస్తున్నారు. మరోవైపు తమన్నా ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ లో నటిస్తుంది. ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించగా.. అశోఖ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్నా అఘోరి పాత్రలో కనిపించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.