AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Priyanka Jain: తిరుపతికి మెట్ల దారిలో బిగ్ బాస్ ప్రియాంక, శివ్.. ఒక్కసారిగా చిరుత…!

కేవలం ఇన్ స్టాలోనే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో రకరకాల థంబ్ నైల్స్ పెట్టి వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. గతంలో బిగ్ బాస్ కు వెళ్లొచ్చినందుకు తన ప్రియుడు శివ్ తో గొడవలు జరిగాయంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అలాగే బిగ్ బాస్ డబ్బులతో ఎంత బంగారం కొన్నాను.. ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనే విషయాలను షేర్ చేసింది. ఇక ఇప్పుడు ప్రియాంక షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

Bigg Boss Priyanka Jain: తిరుపతికి మెట్ల దారిలో బిగ్ బాస్ ప్రియాంక, శివ్.. ఒక్కసారిగా చిరుత...!
Priyanka Jain, Shivakumar
Rajitha Chanti
|

Updated on: Mar 24, 2024 | 3:17 PM

Share

మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు ప్రియాంక జైన్, శివ్. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ తో మరింత ఫేమస్ అయ్యింది ప్రియాంక. దీంతో ఆమెకు బిగ్ బాస్ సీజన్ 7లోకి ఛాన్స్ వచ్చింది. అందులో తన ఆట తీరుతో అబ్బాయిలకు పోటీగా నిలబడి టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది. ఇక అందరిలాగే బిగ్ బాస్ షో తర్వాత సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తుంది. కొత్త సీరియల్ ప్రకటించలేదు.. కానీ పర్సనల్ విషయాలన్ని నెట్టింట షేర్ చేసుకుంటుంది. తన పెళ్లి.. కొత్తిళ్లు.. అమ్మ ఆరోగ్యం అంటూ అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. కేవలం ఇన్ స్టాలోనే కాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో రకరకాల థంబ్ నైల్స్ పెట్టి వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. గతంలో బిగ్ బాస్ కు వెళ్లొచ్చినందుకు తన ప్రియుడు శివ్ తో గొడవలు జరిగాయంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అలాగే బిగ్ బాస్ డబ్బులతో ఎంత బంగారం కొన్నాను.. ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అనే విషయాలను షేర్ చేసింది. ఇక ఇప్పుడు ప్రియాంక షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

తాజాగా ప్రియాంక తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోకు తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ థంబ్ నైల్ పెట్టేసింది. ఇటీవల ప్రియాంక తన ప్రియుడు శివకుమార్, స్నేహితురాలు హర్షిత కలిసి తిరుమల వెళ్లినట్లుగా తెలుస్తోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు సాయంకాలం సమయంలో కాలినడకన అలిపిరి మెట్ల మార్గంలో వెళ్లారు. అయితే మధ్యలో ప్రియాంకకు చిరుత వచ్చిందంటూ భయపెట్టాడు శివ. దీంతో చిరుత వచ్చిందంటూ హడావిడి చేశారు. ఆ తర్వాత తాము చూసింది చిరుత కాదని.. ఘాట్ రోడ్డులో వెళ్తున్న కారు హెడ్ లైట్స్ అని.. కానీ అవి చిరుత కళ్లలాగా కనిపించాయంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే చిరుత వచ్చిందంటూ వీరిద్దరు పరిగెత్తిన సమయంలో వారి వెనక మరికొందరు జనాలు నడుస్తూ కనిపించారు.ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ తిరుపతి మెట్ల దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ థంబ్ నైల్ పెట్టడంతో వీరిపై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.

ముందు మీరు థంబ్ నైల్ మార్చండి.. తిరుమల వెళ్లే భక్తులకు మళ్లీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు.. తిరుపతి వెళ్లే భక్తులకు భయందోళనకు గురిచేయకండి.. నీకేమన్నా చేతనైతే మంచి వీడియోలు పెట్టండి.. అంతేకానీ భక్తితో భయాందోళనకు గురిచేసే వీడియోస్ పెట్టకండి అని.. ముందు థంబ్ నైల్ మార్చండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. నిజానికి కొద్ది రోజుల క్రితం తిరుపతి మెట్ల మార్గంలో ఓ చిన్నారిపై చిరుత అటాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున కలకలం రేగింది. దీంతో ఇప్పుడు మెట్ల మార్గంలో వెళ్తున్న ప్రతి ఒక్కరికి చేతి కర్ర ఇచ్చి పంపుతున్నారు అధికారలు . ఇప్పుడిప్పుడే చిరుత విషయాన్ని మర్చిపోతున్న ప్రజలకు మరోసారి మెట్ల మార్గంలో చిరుత అటాక్ అంటూ థంబ్ నైల్ పెట్టడంతో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి