AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అందాల నటుడి’ లో ‘ అర్జున్ రెడ్డి’ !

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనోడి క్రేజ్ మాములుగా లేదు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు విజయ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. విజయ్ మాత్రం ఆచి, తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. కానీ ‘డియర్ కామ్రేడ్’ రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత పూరి డైరెక్షన్‌లో ‘ఫైటర్’ మూవీ చేయనున్నాడు. అయితే […]

'అందాల నటుడి' లో ' అర్జున్ రెడ్డి' !
Ram Naramaneni
| Edited By: Nikhil|

Updated on: Dec 04, 2019 | 5:15 PM

Share

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మనోడి క్రేజ్ మాములుగా లేదు. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు విజయ్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. విజయ్ మాత్రం ఆచి, తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. కానీ ‘డియర్ కామ్రేడ్’ రిజల్ట్ మాత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు.ఆ తర్వాత పూరి డైరెక్షన్‌లో ‘ఫైటర్’ మూవీ చేయనున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఏఎల్‌ విజయ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఓ క్రేజీ రోల్‌లో కనిపించనున్నారని ఫిల్మ్ నగర్ నుంచి వస్తోన్న సమాచారం.

జయలలిత హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఆమె లైఫ్‌లో శోభన్ బాబు పాత్ర కీలకంగా ఉండేదని చాలా రూమర్స్ వచ్చాయి. ఇప్పుటికి అవి కంటిన్యూ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి అప్పట్లో చాలా సినిమాల్లో నటించారు. ఈ నేపథ్యంలో ‘తలైవి’ దర్శకుడు శోభన్ బాబు పాత్రను కూడా సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఆ రోల్ కోసం విజయ్‌ దేవరకొండను అప్రోచ్ అవ్వగా అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇక మూవీలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్‌ స్వామి, కరుణానిథి పాత్రలో ప్రకాష్‌ రాజ్‌లు నటిస్తుండగా..ఎన్టీఆర్ పాత్ర కోసం బాలకృష్ణను అప్రోచ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ‘తలైవి’ టీజర్, ఫస్ట్ లుక్ వచ్చాయి. కంగనా లుక్‌పై రకరకాల విమర్శలు వచ్చాయి. ఇక ఆమెకు వివాదాలు ఎంత ఇష్టమో కొత్తగా చెప్పాలా..?. మరోవైపు విజయ్ కూడా వివాదాస్పద చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే స్టార్ ఇమేజ్ సంపాదించాడు. మరి వీరిద్దరూ కలిసి కాంట్రవర్షియల్ రోల్స్‌లో నటిస్తే..ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా..?. లెట్స్ వెయిట్ అండ్ సీ.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..