Dalljiet Kaur: రెండో భర్తతో విభేదాలు.. పెళ్లై ఏడాది కాకముందే విడాకులు తీసుకున్న నటి ?..

ప్పటికే నటుడు షాలిన్ బానోత్‏ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. 2009లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి జైడన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో కొన్నాళ్లపాటు తన కుమారుడితో కలిసి ఒంటరిగా నివసించింది దల్జీత్ కౌర్. దుబాయ్ లో జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్ పటేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నిఖిల్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ భార్యకు విడాకులు ఇచ్చి విడిగా జీవిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.

Dalljiet Kaur: రెండో భర్తతో విభేదాలు.. పెళ్లై ఏడాది కాకముందే విడాకులు తీసుకున్న నటి ?..
Dalljiet Kaur
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 11, 2024 | 8:10 AM

బుల్లితెరపై ‘చూపులు కలిసిన శుభవేళ’ సీరియల్ అప్పట్లో ఓ రేంజ్ రెస్పాన్స్ అందుకుంది. హిందీలో ప్రసారమైన ఈ ధారవాహిక.. తెలుగులోనూ డబ్ చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నటించిన దల్జీత్ కౌర్‏కు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ వ్యక్తిగత జీవితం మాత్రం అంతా సజావుగా సాగడం లేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నటుడు షాలిన్ బానోత్‏ను పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు. 2009లో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి జైడన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య తలెత్తడంతో 2013లో విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో కొన్నాళ్లపాటు తన కుమారుడితో కలిసి ఒంటరిగా నివసించింది దల్జీత్ కౌర్. దుబాయ్ లో జరిగిన ఫ్రెండ్స్ పార్టీలో నిఖిల్ పటేల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. నిఖిల్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ భార్యకు విడాకులు ఇచ్చి విడిగా జీవిస్తున్నాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు డేటింగ్‏లో ఉన్న వీరు గతేడాది పెళ్లి చేసుకున్నారు.

గతేడాది మార్చిలో దల్జీత్, నిఖిల్ వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వీరు లండన్ లో సెటిల్ అయ్యారు. అయితే ఇప్పుడు తన రెండో భర్తతోనూ దల్జీత్ విడిపోయిందనే ప్రచారం నడుస్తోంది. ఇటీవలే తన కొడుకు జైడన్ తో తిరిగి ఇండియాకు వచ్చేసింది దల్జీత్. ఆ తర్వాత తన ఇన్ స్టాలో పెళ్లి ఫోటోలను డెలీట్ చేసింది. అంతేకాకుండా ఆమె ఇన్ స్టా బయోలో ‘పటేల్’ ఇంటిపేరును కూడా తొలగించింది. దీంతో వీరిద్దరి విడాకులు తీసుకున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది. ఇక ఈ ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ నిఖిల్ సైతం తన సోషల్ మీడియా ఖాతాలలో పెళ్లి ఫోటోస్ డిలీట్ చేశాడు. అదే సమయంలో దల్జీత్ ఇన్ స్టాలో ఓ నోట్ షేర్ చేసింది.

ప్రస్తుతం దల్జీత్ ఆమె కుమారుడు జైడన్ ఇండియాలోనే ఉన్నారని.. దల్జీత్ తండ్రికి సర్జరీ చేయాల్సి ఉందని.. ఇప్పుడు ఆమె వారి కుటుంబంతో ఉండడం చాలా ముఖ్యమని అందులో పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ఆమె ఏ అంసం గురించీ మాట్లాడాలనుకోవడం లేదు. ఎందుకంటే మొత్తం వ్యవహారంలో పిల్లలు కూడా ఉన్నారు. వారి గోప్యతకు భంగం కలిగించవచ్చు అంటూ ఆ ప్రకటనలో రాసుకొచ్చారు. దీంతో దల్జీత్, నిఖిల్ విడాకుల విషయం నిజమే అని తెలుస్తోంది. పెళ్లై ఏడాది కాకముందే ఇద్దరు విడిపోవడమేంటనీ షావుతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Soapbox (@soapboxprelations)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.