Yatra 2: ‘ఇంత మొండోడివి ఏంటి వైఎస్ జగన్ అన్నా’.. ‘యాత్ర 2’ సినిమాపై స్టార్‌ యాంకర్‌ రివ్యూ.. వీడియో

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నిజ జీవితంలోని కీలక ఘట్టాలను ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2. 2019 రిలీజై సూపర్‌ హిట్‌ గా నిలిచిన యాత్ర సినిమాకు ఇది సీక్వెల్‌. పార్ట్‌ 1ను తెరకెక్కించిన మహి వి రాఘవ్ సుమారు ఐదేళ్ల తరువాత మళ్లీ ‘యాత్ర 2’ సినిమాను ఆడియెన్స్‌ ముందుకు తెచ్చారు.

Yatra 2: 'ఇంత మొండోడివి ఏంటి వైఎస్ జగన్ అన్నా'.. 'యాత్ర 2' సినిమాపై స్టార్‌ యాంకర్‌ రివ్యూ.. వీడియో
Anchor Sravanthi
Follow us
Basha Shek

|

Updated on: Feb 10, 2024 | 5:33 PM

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నిజ జీవితంలోని కీలక ఘట్టాలను ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర 2. 2019 రిలీజై సూపర్‌ హిట్‌ గా నిలిచిన యాత్ర సినిమాకు ఇది సీక్వెల్‌. పార్ట్‌ 1ను తెరకెక్కించిన మహి వి రాఘవ్ సుమారు ఐదేళ్ల తరువాత మళ్లీ ‘యాత్ర 2’ సినిమాను ఆడియెన్స్‌ ముందుకు తెచ్చారు. ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌ పాజిటివ్ టాక్‌ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద డీసెంట్‌ కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో యాత్ర 2 సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. తాజాగా బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్‌, ప్రముఖ యాంకర్‌ స్రవంతి చొక్కారపు సీఎం జగన్‌ బయోపిక్‌ ను థియేటర్లలో చూసింది. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంది. యాత్ర 2లో కీలక సన్నివేశాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన యాంకర్‌ స్రవంతి.. ‘ఇంత మొండోడివి ఏంటి వైఎస్ జగన్ అన్నా.. మీరు కూడా యాత్ర2 మూవీ చూసి.. జగన్ అన్న మొండితనాన్ని ఆయన ధైర్యాన్ని, గెలుపుని ఎక్స్‌పీరియెన్స్‌ చేయండి’ అంటూ రాసుకొచ్చింది స్రవంతి.

ప్రస్తుతం యాంకర్‌ స్రవంతి షేర్‌ చేసిన పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ గా మారింది. ‘నువ్వు సూపరక్కా’ అంటూ సీఎం జగన్‌ అభిమానులు, వైసీపీ ఫ్యాన్స్‌ స్రవంతిపై పాజిటివ్‌ కామెంట్స్‌ పెడుతుంటే మరికొందరు యాంటీ ఫ్యాన్స్‌ మాత్రం స్రవంతిపై నెగెటివ్‌ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా పుష్ప సినిమా ఇంటర్వ్యూతో బాగా ఫేమస్ అయ్యింది స్రవంతి చొక్కారపు. ఆతర్వాత బిగ్‌ బాస్‌ నాన్‌ స్టాప్‌ ఓటీటీ సీజన్‌ లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక సోషల్‌ మీడియాలో బిజీగా ఉండే ఈ యాంకరమ్మ తరచూ తన హాట్‌ ఫొటోస్‌, వీడియోలను అందులో షేర్‌ చేస్తుంటుది.

ఇవి కూడా చదవండి

థియేటర్ లో యాత్ర 2 సినిమాను చూస్తోన్న యాంకర్ స్రవంతి..

యాత్ర 2 మేకింగ్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.