Bigg Boss 6: బ్రేకింగ్ అప్‌డేట్.. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఆమెనే.. మీరు ఊహించారా..?
యస్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలిసిపోయింది. కంటెంట్ ఇచ్చినప్పటికీ.. ఓ ఫీమేల్ కంటెస్టెంట్‌కు జనాలు గట్టిగా ఓట్లు వేయలేదు.
బిగ్ బాస్ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈవారం ఎలిమేషన్ అయ్యేది ఎవరో లీకు వీరుల ద్వారా తెలిసిపోయింది. ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవ్వగా ఎవ్వరూ ఊహించని విధంగా.. ఓ ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. రేవంత్ టాప్ ఓటింగ్‌తో సేవయినట్లు సమచారం. ఇక తను అనుకున్నది అనుకున్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతున్న ఇనయ భారీ ఓటింగ్ సంపాదించి.. అందరికీ ఝలక్ ఇచ్చింది. అన్ అఫీషియల్ ఓటింగ్‌లో కూడా ఆమెకు భారీగా ఓట్లు వచ్చాయి. శ్రీహాన్ యథావిదిగానే సేవ్ అయ్యాడని సమాచారం. కీర్తి భట్‌కు టీవీ వీక్షకులతో పాటు సింపథీ ఓట్లు ప్లస్ అయ్యాయి. కంటెంట్ ఇస్తున్న గలాటా గీతు కూడా సేఫ్ అయ్యింది. ఈ మధ్యకాలంలో ఆటతీరు మార్చుకున్న రాజ్‌ను కూడా బిగ్ బాస్ ఇంట్లో ఇంకొన్నాళ్లు ఉంచాలని వీక్షకులు డిసైడయ్యారు. సత్యతో పులిహోర కలుపుతూ అర్జున్ కళ్యాణ్ సేవ్ అయ్యాడు. ఆర్జే సూర్య, సుదీప, ఆరోహి చాలా తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో పడ్డారు. ఈ క్రమంలోనే ఆరోహి ఇంటి నుంచి ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆరోహి ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. మాట కాస్త కటువు ఎక్కువ. ఎవ్వరితోనైనా బరాబర్ మాట్లాడుతుంది. అయితే ఆమె బిగ్ బాస్‌కు ముందు జనాలకు పెద్దగా తెలియకపోవడం ఒక మైనస్. ఇక సూర్యతో ప్రెండ్షిప్ కారణంగా కొన్ని టాస్కుల్లో ఆరోహి కాంప్రమైజ్ అయినట్లు మరికొందరి వెర్షన్. మొత్తంగా ఆరోహి ఎలిమేషన్‌ను చాలామంది ఊహించరనే చెప్పాలి. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ ఇంట్లో ఇంకా ఉన్న కొందరితో పోల్చుకుంటే ఆరోహి చాలా యాక్టివ్. గేమ్ బాగా ఆడుతుంది. కంటెంట్ కూడా ఇస్తుంది. కానీ ఏం చేస్తాం.. జనాల ఓటింగ్‌ను గౌరవించాలి కదా..!
కాగా ఈ సీజన్ బిగ్ బాస్ అంతగా రంజిపజేయడం లేదన్నది చాలామంది వెర్షన్. హోస్ట్ నాగార్జున వార్నింగ్ ఇచ్చి.. ఇచ్చి విసిగిపోయి.. చివరకు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తనే ఇద్దర్ని నామినేట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కొందరు రేలంగి మామయ్యలు, పులిహోర రాజాలు కంటెంట్ ఇవ్వడంలో విఫలమవుతూనే ఉన్నారు. లెట్స్ సీ మున్ముందు అయినా హీట్ పెరుగుతుందేమో..!
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.