Kushbu Sundar: గృహహింసకు వ్యతిరేకంగా గళం విప్పిన స్టార్ హీరోయిన్.. బుల్లితెరపై స్టాండ్ విత్ మీరా అంటూ..
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్భు (Kushbu Sundar).. ఇప్పుడు మరోసారి వెండితెరపై అలరిస్తోంది. ఇటీవల విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఖుష్భు (Kushbu Sundar).. ఇప్పుడు మరోసారి వెండితెరపై అలరిస్తోంది. ఇటీవల విడుదలైన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక తల్లి పాత్రలో నటించిన ఖుష్బు సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు తలుపుతడుతున్నాయి. తాజాగా ఖుష్భు మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఖుష్భూ ప్రధాన పాత్రలో నటించిన మీరా సీరియల్ త్వరలోనే ప్రసారం కానుంది. ఈ సీరియల్లో ఖుష్భూ కేవలం మెయిర్ రోల్ మాత్రమే కాకుండా.. స్క్రీన్ రైటర్‌గానూ పనిచేస్తుంది. ఈ సీరియల్ మార్చి 28 నుంచి ప్రసారం కానుంది. భార్యభర్తల మధ్య ఉన్న చేదు, తీపి సంబంధాన్ని ఇందులో తెలియజేయనున్నారు. అలాగే.. కొన్ని కారణాలతో వారిద్దరు విడిపోవడం.. ఆ తర్వాత వారిద్దరు ఎలా కలుసుకుంటారు అనే విషయాలతో సీరియల్ ఉండనుంది.
తాజాగా విడుదలైన ప్రోమోలో కృష్ణ, సురేష్ మీనన్ భార్య మీరా పాత్రలో ఖుష్బూ నటించింది. పిల్లల ముందే భార్య చేసుకోవడం.. వంటి అంశాలను ఇందులో చూపించారు. అయితే ఇటీవల ఈ విషయంపై కలర్స్ తమిళ్ ఛానల్ మిస్డ్ కాల్ ప్రచారాన్ని నిర్వహించింది. భర్త తన భార్యను కొట్టడాన్ని మీరు సమర్థిస్తారా ? లేదా ? అంటూ టోల్ ఫ్రీ నంబర్ షేర్ చేసింది. భర్త భార్యపై చేయి చేసుకోవడం సమర్థిస్తున్నారా ? స్టాండప్ విత్ మీరా అంటూ ప్రజల్లోకి సీరియల్ గురించి ప్రచారాన్ని చేరవేసింది. మహిళలు గృహ హింసకు గురికావడానికి వ్యతిరేకంగా ఖుష్బూ పోరాటం చేస్తుంది. అన్ని వర్గాల మహిళలు.. బాగా చదువుకున్న వారు.. పట్టణాల్లో.. గ్రామాల్లో ఉండేవారు గృహహింసను ఎలా ఎదుర్కోవాలి అనే విషంయపై ప్రేక్షకులకు తెలియజేయడమే మీరా సీరియస లక్ష్యం అని నిర్వాహకులు తెలిపారు.
View this post on Instagram
View this post on Instagram
Also Read: Pooja Hegde: ప్రభాస్..పూజా హెగ్డే మధ్య గొడవలు.. అసలు విషయం చెప్పేసిన టాలీవుడ్ బుట్టబొమ్మ..
Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..
Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..