Chinnari Pelli Kuturu: ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం ‘చిన్నారి పెళ్లికూతురు’.. వరస మరణాల కలకలం

Chinnari Pelli Kuturu: హిందీలో బాలికా వధూ సీరియల్ అప్పట్లో ఓ సంచలనం... భాషలతో సంబంధం లేకుండా ఈ సీరియల్ కు అభిమానులు పట్టంగట్టారు.. దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న..

Chinnari Pelli Kuturu:  ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం ‘చిన్నారి పెళ్లికూతురు’.. వరస మరణాల కలకలం
Chinnari Pelli Kuturu
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2021 | 4:17 PM

Chinnari Pelli Kuturu: హిందీలో బాలికా వధూ సీరియల్ అప్పట్లో ఓ సంచలనం… భాషలతో సంబంధం లేకుండా ఈ సీరియల్ కు అభిమానులు పట్టంగట్టారు.. దేశ విదేశాల్లో అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీరియల్ లో నటించిన నటీనటులందరూ సినీ ఇండస్ట్రీలో సెలబ్రేటీలుగా హోదా అందుకున్నారు. ఇక బాలికా వధూ తెలుగులో చిన్నారి పెళ్లికూతురు గా ప్రసారమైంది.  తెలుగులో కూడా చిన్నారి పెళ్లి కూతురుకి మంచి ఆదరణ దక్కింది. టాప్ రేటింగ్ తో దూసుకుపోయింది.

అవికా గోర్, ప్రత్యూష బెనర్జీ, శశాంక్ వ్యాస్, సిద్ధార్ద్ శుక్లా, సురేఖ సిక్రి, అనూప్ సోని ఇలా అందరూ తమ తమ పాత్రల్లో జీవించి.. ఈ సీరియల్ ద్వారా  రా పాన్ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే చిన్నారి పెళ్లి కూతురులో హీరోగా నటించిన సిద్ధార్ధ్ శుక్లా ఈరోజు గుండెపోటుతో మరణించగా.. హీరోయిన్ గా నటించిన ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఇక ఇదే సీరియల్ లో పూర్వపు సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే చాదస్తపు బామ్మగా నటించి ఆ పాత్రలో మెప్పించిన సురేఖా సిక్రీ కూడా ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు.

చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్   ప్రత్యూష బెనర్జీ మరణం అందరికీ షాక్ నిచ్చింది. 2016 ఏప్రిల్ 1న యంగ్ ప్రత్యూష బెనర్జీ అనుమదాస్పద స్థితిలో మృతి చెందింది.  ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య పెను సంచలనానికి దారితీసింది.ఆమె బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ చేతిలో మోసపోయే తమ కూతురు సూసైడ్ చేసుకుందని ప్రత్యూష బెనర్జీ తల్లిదండ్రులు ఆరోపిస్తునే ఉన్నారు. తమ కూతురు మరణంపై న్యాయవ్యవస్థలో ఇంకా పోరాడుతూనే ఉన్నారు.

ఇదే సీరియల్ లో సంప్రదాయం పాటించే ఇంటి పెద్దా, గడుసరి, మొండి, కోపిష్టి, ప్రేమను పంచే బామ్మగా తన నటనతో ఆకట్టుకున్న చిన్నారి పెళ్లి కూతురు బామ్మ సురేఖా సిక్రి 2021 జూలై 16న అనారోగ్యంతో కన్నుమూశారు. జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డులను అందుకున్న సురేఖా సిక్రీ ముంబైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన  బాలీవుడ్ టీవీ సీరియల్ నటుడు బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్ధ్ శుక్లా    ఈ రోజు ఉదయం గుండె పోటుతో మరణించారు.  తన నటనతో డ్యాన్స్ షో లతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. 40 ఏళ్ల  సిద్ధార్థ్ శుక్లా 1980 డిసెంబర్‌ 12న అశోక్‌-రీతా శుక్లా దంపతులకు సిద్దార్థ్‌ జన్మించారు. తన తల్లి, ఇద్దరు చెల్లెళ్లతో నివాసం  ఉంటున్నారు. ఇంటీరియర్‌ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన సిద్ధార్ద్ సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  పలు హిట్ సీరియల్స్ లో నటించిన సిద్ధార్ధ్ చిన్న వయసులో మరణించారు.

ఈ సీరియల్ లోని మెయిన్ క్యారెక్టర్ లో నటించిన ముగ్గురు నటుల మృతి తో ఆ సీరియల్ లో నటించిన సహా నటీనటులు వారితో అనుబంధాన్ని .. గుర్తు చేసుకుంటున్నారు.

Also Read: Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు హరిహరవీరమల్లు చిత్రమూనిట్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ..రిలీజ్ ఎప్పుడంటే

నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్‌కు జైలు శిక్ష, జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.. ఎందుకంటే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్