AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Smile Day 2024: నవ్వడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం!

'నవ్వు నాలుగు విధాల చేటు' అనే పెద్దలు అంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో 'నవ్వితే నలభై విధాల మేలు' అని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో నవ్వకపోతే నాలుగు విధాల చేటు. మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులే అయి ఉంటుంది. నవ్వడం అనే విషయం కూడా మర్చిపోతున్నారు. రోజంతా పనిలో ఉండి నవ్వడం అనే సంగతే మర్చిపోతున్నారు. ముఖాన్ని సీరియస్‌గా పెట్టుకోవడం బాగా అలవాటు అయిపోతుంది. ఇలా నవ్వకుండా ఉండటం వల్ల..

National Smile Day 2024: నవ్వడం వల్ల ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం!
National Smile Day 2024
Chinni Enni
|

Updated on: May 31, 2024 | 6:01 PM

Share

‘నవ్వు నాలుగు విధాల చేటు’ అనే పెద్దలు అంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో ‘నవ్వితే నలభై విధాల మేలు’ అని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో నవ్వకపోతే నాలుగు విధాల చేటు. మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులే అయి ఉంటుంది. నవ్వడం అనే విషయం కూడా మర్చిపోతున్నారు. రోజంతా పనిలో ఉండి నవ్వడం అనే సంగతే మర్చిపోతున్నారు. ముఖాన్ని సీరియస్‌గా పెట్టుకోవడం బాగా అలవాటు అయిపోతుంది. ఇలా నవ్వకుండా ఉండటం వల్ల చాలా రకాల నష్టాలు, అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ వంటివి రావచ్చని చెబుతున్నారు. నవ్వడం వల్ల మితి మీరిన ఒత్తిడి నుంచి బయట పడొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో మనల్ని నవ్వు నుంచి దూరం చేస్తున్నాయి. కాసేపు కబుర్లు చెప్పుకుని నవ్వుదామని అనుకున్నా.. కుదరడం లేదు. మరి నవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడి – డిప్రెషన్ దూరం అవుతాయి:

నవ్వడం వల్ల చాలా వరకు ఒత్తిడిని రిలీఫ్ పొందవచ్చు. శరీరంలో కార్టిసాల్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. ఒత్తిడికి కారణం ఈ హార్మోనే. కాబట్టి మనం గట్టిగా నవ్వడం వల్ల.. బ్రెయిన్‌కి మనం రిలాక్స్‌గా ఉన్నామనే సిగ్నల్స్ వెళ్తాయి. దీంతో టెన్షన్ వంటివి తగ్గుతాయి. డిప్రెషన్ కూడా దూరమవుతుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

నవ్వడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి తగ్గుతుంది. చాలా మందికి తల నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకు నవ్వక పోవడం కూడా ఒక రీజన్‌గా చెప్పొచ్చు. కాబట్టి మీ నవ్వే మీకు ఔషధంలా పని చేస్తుంది.

ఇవి కూడా చదవండి

పెయిన్ కిల్లర్‌‌లా వర్క్ అవుతుంది:

నవ్వు పెయిన్ కిల్లర్‌లా కూడా పని చేస్తుంది. నవ్వడం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీంతో మీ శరీరంలోని పలు రకాల నొప్పులు అనేవి తగ్గుతాయని పలు పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

కమ్యూనికేషన్ పెరుగుతాయి:

నవ్వడం వల్ల ఇతరులు దగ్గర అవుతూ ఉంటారు. దీంతో ఎదుటి వారితో కమ్యునికేషన్ అనేది పెరుగుతుంది. మానవ సంబంధాలు బలపడతాయి. ఎదుటి వారికి సహాయం చేసేలా చేస్తాయి. నవ్వుతూ పలకరించడం వల్ల.. ఎదుటి వారు కూడా కంఫర్ట్ బుల్‌గా ఫీల్ అవుతారు.

బీపీ తగ్గుతుంది:

నవ్వడం వల్ల రక్త పోటు అనేది తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నవ్వేటప్పుడు శరీరం అంతా రిలాక్స్ అవుతుంది. దీంతో రక్త నాళాల్లో రక్త ప్రవాహం కూడా సజావుగా సాగుతుంది. రక్త ప్రసరణ కూడా చక్కగా జరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..