కన్నడ హీరోతో జత కట్టబోతున్న మిల్కీబ్యూటీ?

కన్నడ హీరోతో జత కట్టబోతున్న మిల్కీబ్యూటీ?

సక్సెస్ ఫుల్ 'మస్తీ' మూవీ ఫేమ్ నార్తన్ డైరెక్షన్‌లో యశ్ హీరోగా ఓ కన్నడ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకోబోతున్నట్ల టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు కేజీఎఫ్ మొదటి పార్ట్‌లో ఓ స్పెషల్ సాంగ్‌లో..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 03, 2020 | 3:56 PM

కన్నడ హీరో యశ్ ‘కేజీఎఫ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి.. ఊహించని విధంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోగా నటించిన యశ్‌కి ఒక్కసారిగా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం డైరెక్టర్ నీల్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్-2’లో నటిస్తున్నాడు. కాగా ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీ అక్టోబర్‌లో రిలీజ్ కానుందని సమాచారం. అయితే ఇప్పుడు ఈ చిత్రంతో పాటు మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చేశాడు యశ్.

సక్సెస్ ఫుల్ ‘మస్తీ’ మూవీ ఫేమ్ నార్తన్ డైరెక్షన్‌లో యశ్ హీరోగా ఓ కన్నడ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ తమన్నాను తీసుకోబోతున్నట్ల టాలీవుడ్‌లో ఓ టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు కేజీఎఫ్ మొదటి పార్ట్‌లో ఓ స్పెషల్ సాంగ్‌లో తమన్నా కనిపించిన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పూర్తిస్థాయి చిత్రం చేయనున్నారని సమాచారం. కాగా అటు ఈ సినిమాపై అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే మిల్కీ బ్యూటీతో చిత్ర బృందం సంప్రదింపులు జరిపిందని, కాగా ఇందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘సీటీ మార్‌’లో నటిస్తుంది.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu