ఎన్టీఆర్ కంటే ముందు ఆ హీరోతో మూవీ తీయాలనుకుంటోన్న త్రివిక్రమ్..!

ఎన్టీఆర్ కంటే ముందు ఆ హీరోతో మూవీ తీయాలనుకుంటోన్న త్రివిక్రమ్..!

'అల వైకుంఠపురములో' మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో ప్రకటించిన విషయం తెలిసిందే.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 03, 2020 | 2:32 PM

‘అల వైకుంఠపురములో’ మూవీతో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్‌తో ప్రకటించిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. కాగా ఈ మూవీని మొదట జూన్ నుంచి సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని దర్శకనిర్మాతలు భావించారు. ఆ లోపు ఎన్టీఆర్ నటిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌ పూర్తి అవుతుందని త్రివిక్రమ్ అంచనా వేశారు.

అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడటంతో.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం కానుంది. ఇక ఈ క్రమంలో త్రివిక్రమ్‌- ఎన్టీఆర్ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు ఇంకా చాలా సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ మరో నిర్ణయం తీసుకున్నారట. ఎన్టీఆర్‌ సినిమా కంటే ముందు వెంకటేష్‌తో మూవీని తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నారట. మూడు సంవత్సరాల క్రితమే వెంకటేష్‌తో ఓ సినిమాను ప్రకటించారు త్రివిక్రమ్‌. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో మూవీకి సమయం ఉండటంతో ఆ లోపు వెంకీతో ఓ చిత్రాన్ని తీయాలని ఆయన భావిస్తున్నారట. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం కోసం త్రివిక్రమ్ ఎదురుచూస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా తెరకెక్కబోతుందా..? లాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: కథ వినకుండానే ఆ దర్శకుడికి ఆఫర్ ఇచ్చిన చిరు.. కారణం అదేనా..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu