కరోనా లాక్‌డౌన్‌: అమెరికాలో అత్యధిక మంది చూసిన చిత్రం మనదే..!

కరోనా లాక్‌డౌన్‌: అమెరికాలో అత్యధిక మంది చూసిన చిత్రం మనదే..!

కరోనా నేపథ్యంలో అమెరికాలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇళ్లకే పరిమితమైన అమెరికావాసులు టీవీలకు అతుక్కుపోయారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 03, 2020 | 3:13 PM

కరోనా నేపథ్యంలో అమెరికాలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఇళ్లకే పరిమితమైన అమెరికావాసులు టీవీలకు అతుక్కుపోయారు. ఈ క్రమంలో ఈ వారంలో అక్కడి వారు అత్యధికంగా చూసిన చూసిన సినిమా ఏంటో తెలుసా..? 3 ఇడియట్స్‌. ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మన్‌ జోషీ, కరీనా కపూర్‌, బొమన్ ఇరానీ, ఓమీ వైద్య తదితరులు ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ.. ”దశాబ్దం క్రితం మేము ఎంతో ఇష్టపడి చేసిన 3 ఇడియట్స్‌ ఇప్పటికీ అందరి మన్ననలు పొందుతుండం సంతోషంగా ఉంది” అని అన్నారు.

కాగా విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ రాజ్‌ కుమార్ హిరానీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అంతేకాదు బాక్సాఫీస్ వద్ద రూ.460కోట్లు కలెక్ట్ చేసి.. అక్కట్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. కాగా ఈ మూవీ వచ్చి 11 సంవత్సరాలు కాగా.. ఇప్పటికీ అమెరికాలో క్రేజ్‌ తగ్గకపోవడం విశేషం. మరోవైపుప్రపంచంలో అత్యధిక మంది చూసిన సినిమా లిస్ట్‌లో భారత్ నుంచి ఇప్పటికీ 3 ఇడియట్స్‌ మాత్రమే ఉండటం గమనించిదగ్గ విషయం.

Read This Story Also: మూడు సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: క్రికెటర్ షమీ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu