‘ఆచార్య’ నుంచి కాజల్ త‌ప్పుకుందా..? క‌్లారిటీ వ‌చ్చేసింది…

'ఆచార్య' నుంచి కాజల్ త‌ప్పుకుందా..? క‌్లారిటీ వ‌చ్చేసింది...

చిరంజీవి హీరోగా కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తోన్న మూవీ నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకుందని గత కొన్నిరోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ తమిళ మూవీకి అడ్వాన్స్ తీసుకున్న ఆమె కాల్షీట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా స్పందించిన కాజల్ పీఆర్ టీమ్ ఆ వార్తలను ఖండించారు. ‘ఆచార్య’ నుంచి కాజల్ తప్పుకుందంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని పేర్కొన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో సామాజిక క‌థ‌శాంతో రూపొందుతున్న ఆచార్య […]

Ram Naramaneni

|

May 03, 2020 | 3:02 PM

చిరంజీవి హీరోగా కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తోన్న మూవీ నుంచి హీరోయిన్ కాజల్ అగర్వాల్ తప్పుకుందని గత కొన్నిరోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఓ తమిళ మూవీకి అడ్వాన్స్ తీసుకున్న ఆమె కాల్షీట్స్ అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని రూమ‌ర్స్ వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా స్పందించిన కాజల్ పీఆర్ టీమ్ ఆ వార్తలను ఖండించారు. ‘ఆచార్య’ నుంచి కాజల్ తప్పుకుందంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని పేర్కొన్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో సామాజిక క‌థ‌శాంతో రూపొందుతున్న ఆచార్య సినిమాను..చిరు త‌న‌యుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. మొదట ఈ చిత్రంలో త్రిషను హీరోయిన్ గా ఫైన‌ల్ చేయగా అనూహ్యంగా ఆమె తప్పుకోవడంతో వెంటనే కాజల్‌ని ఎంపిక‌ చేశారు మేక‌ర్స్. అయితే కాజల్ కూడా తప్పుకుందని వస్తున్న వార్తలు మెగా ఫ్యాన్స్ ను ఆందోళ‌న‌కు గురిచేశాయి. కాజ‌ల్ పీఆర్ టీమ్ స్పందించడంతో ఇప్పుడు అంద‌రూ హ్య‌పీ ఫీల్ అవుతున్నారు.

ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని స‌మాచారం. ఇక ఈ మూవీలో హాట్ హీరోయిన్ రెజీనా ఓ స్పెషల్ సాంగ్ చేస్తుండటం విశేషం. మణిశర్మ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu