పవన్ చేయాల్సిన రీమేక్‌లో నటించబోతున్న చిరు..!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అర డజన్ దర్శకులను తన లిస్ట్‌లో పెట్టుకున్నారు చిరు.

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అవ్వాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అర డజన్ దర్శకులను తన లిస్ట్‌లో పెట్టుకున్నారు చిరు. సుకుమార్, సుజీత్, బాబీ, హరీష్ శంకర్, మెహర్ రమేష్, పరశురామ్, అనిల్ రావిపూడిలు మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఈ లిస్ట్‌లో మెహర్ రమేష్ ఉండటంపై మెగా ఫ్యాన్స్ నుంచి కాస్త అసంతృప్తి వ్యక్తమైంది. అయితే సీసీసీ కోసం మెహర్ చేసిన కష్టానికి మెచ్చిన చిరు.. ఎలాగైనా అతడికి బ్రేక్ ఇవ్వాలనే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మెహర్ రమేష్‌తో సినిమా విషయంలో కథ మొదలు ప్రొడక్షన్ కూడా తానే దగ్గరుండి చూసుకోవాలని చిరు భావిస్తున్నారట. ఈ క్రమంలో మెహర్ రీమేక్ కోసం వేదాళం రీమేక్‌ను చిరు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన వేదాళం అక్కడ ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ఎప్పటినుచంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రీమేక్‌లో నటించేందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకున్నట్లు కూడా ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అంతేకాదు ఎస్‌జే సూర్య ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించేందుకు ఒప్పుకున్నట్లు కూడా టాక్ నడిచింది. కానీ ఆ తరువాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ రీమేక్ ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఈ రీమేక్‌లో నటించాలని చిరు అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Read This Story Also: కరోనా అప్‌డేట్స్.. ప్రపంచవ్యాప్తంగా 35లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు..!