చెర్రీకి భారత స్టార్ బాక్సర్‌ పాఠాలు.. ఫొటో వైరల్..!

చెర్రీకి భారత స్టార్ బాక్సర్‌ పాఠాలు.. ఫొటో వైరల్..!

రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, పోలీసుగా, బాక్సర్‌గా కనిపించనున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 04, 2020 | 1:49 PM

రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, పోలీసుగా, బాక్సర్‌గా కనిపించనున్నారు. ఇక ఈ పాత్రలకు సంబంధించి ఇప్పటికే చాలా కసరత్తులు చేసిన చెర్రీ.. ఆ మధ్య విడుదలైన టీజర్‌లో కొత్త లుక్‌లో అందరినీ మెప్పించారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్‌ పడగా.. ప్రస్తుతం బాక్సింగ్‌లో మెలకువలు నేర్చుకుంటున్నారు చెర్రీ. ఈ మేరకు ప్రముఖ భారత బాక్సర్ నీరజ్‌ గోయత్‌, చెర్రీకి పాఠాలు చెప్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన నీరజ్ గోయత్.. రామ్ చరణ్‌తో అద్భుతమైన సమయాన్ని గడిపానని పేర్కొన్నారు. ఇక ఆర్ఆర్ఆర్‌లో ఓ బాక్సింగ్ ఎపిసోడ్‌ ఉండగా.. ఆ ఎపిసోడ్‌కు నీరజ్‌ గోయత్ ఇన్‌పుట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాహుబలి బ్లాక్‌బస్టర్ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: కరోనా క్వారంటైన్ సెంటర్లో ‘టిక్‌టాక్’.. కేసు నమోదు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu