చిరు హిస్టారికల్ మూవీ విశేషాలు చెప్పబోతున్న నాని..!

చిరు హిస్టారికల్ మూవీ విశేషాలు చెప్పబోతున్న నాని..!

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవీ నటించిన హిట్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది.

TV9 Telugu Digital Desk

| Edited By:

May 04, 2020 | 9:20 AM

మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవీ నటించిన హిట్ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మించింది. ఇక ఈ మూవీ విడుదలై ఈ నెల 9వ తేదీకి 30 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో వైజయంతీ మూవీస్‌ ఈ సినిమాకు సంబంధించి మూడు దాగి ఉన్న కథలను అభిమానులకు చెప్పేందుకు సిద్ధమైంది. వాటిని నాని తన వాయిస్ ఓవర్‌లో వినిపించనున్నారు. ఈ నెల 5,7,9 తేదీల్లో జగదేకవీరుడు- అతిలోకసుందరికి చెందిన మూడు దాగి ఉన్న కథలను నాని వినిపించబోతున్నారు. ఈ విషయాన్ని వైజయంతీ మూవీస్ సోషల్ మీడియాలో వెల్లడించింది. కాగా 1990లో విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి అప్పట్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా మెగాస్టార్‌కు నాని పెద్ద అభిమాని అన్న విషయం తెలిసిందే.

Read This Story Also: భారత్‌లో ఆఫ్రికన్ స్వైన్‌ ఫ్లూ.. 2,500 పందులు మృత్యువాత..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu