మహేశ్‌తో ‘కేజీఎఫ్’ డైరక్టర్..?

‘కేజీఎఫ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరును సంపాదించుకున్నాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ రెండో భాగాన్ని తెరకెక్కిస్తోన్న ప్రశాంత్‌కు పలు భాషల సినీ పరిశ్రమల నుంచి పిలుపులు వస్తున్నాయి. అతడితో పనిచేసేందుకు పేరు మోసిన నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ప్రశాంత్ నీల్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మహేశ్ బాబు భార్య నమ్రతను ప్రశాంత్ కలిసినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే ఓ మంచి కథతో […]

మహేశ్‌తో ‘కేజీఎఫ్’ డైరక్టర్..?
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 3:38 PM

‘కేజీఎఫ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరును సంపాదించుకున్నాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ రెండో భాగాన్ని తెరకెక్కిస్తోన్న ప్రశాంత్‌కు పలు భాషల సినీ పరిశ్రమల నుంచి పిలుపులు వస్తున్నాయి. అతడితో పనిచేసేందుకు పేరు మోసిన నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ప్రశాంత్ నీల్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే మహేశ్ బాబు భార్య నమ్రతను ప్రశాంత్ కలిసినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే ఓ మంచి కథతో ప్రశాంత్, మహేశ్‌ను కలవనున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రశాంత్ తన కథతో మహేశ్‌ను ఒప్పిస్తే మహేశ్ బాబు సొంత నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు టాక్. అంతేకాదు అన్నీ కుదిరితే మహేశ్ 27వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందట. మరి మహేశ్‌ను ప్రశాంత్ ఏ మేరకు ఒప్పిస్తాడు..? ఎన్ని భాషలలో ఈ చిత్రం రానుంది..? ఈ విషయాలన్నీ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.