Indian Railways: వేసవి ప్రయాణికులకు ఊరట.. వివిధ ప్రాంతాల మధ్య స్పెషల్’ ట్రైన్స్!
Indian Railways: ఈ వేసవిలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది రైల్వే. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. మీ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా రైల్వే శాఖ సూచించింది..

Indian Railways: వివిధ ప్రాంతాల మధ్య ‘సమ్మర్ వీక్లీ స్పెషల్’ రైళ్లువేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు గమ్యస్థానాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు ఏప్రిల్ నెలలో అందుబాటులో ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్‌లో ప్రత్యేక రైళ్ల వల్ల ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలిగించనున్నాయి.
Driving License: డ్రైవర్ల ఆటో, ట్యాక్సీ లైసెన్స్‌ల రద్దు.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అసలు మ్యాటర్ ఇదే!
ముఖ్యమైన రైళ్ల వివరాలు:
1. చెన్నై సెంట్రల్ – సంత్రాగచ్చి – చెన్నై బీచ్: ఏప్రిల్ 16న (గురువారం) ఉదయం 06.55 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది.
రైలు నం. 06068: ఏప్రిల్ 17న (శుక్రవారం) మధ్యాహ్నం 14.50 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరి, శనివారం సాయంత్రం 18.30 గంటలకు చెన్నై బీచ్ చేరుకుంటుంది.
స్టాపింగ్స్: విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు, గుడూరు, ఒంగోలు, దువ్వాడ, విజయనగరం వంటి ముఖ్య ప్రాంతాల్లో ఈ రైళ్లు ఆగుతాయి.
2. సహర్సా – యశ్వంత్‌పూర్ – సహర్సా: రైలు నం. 05551 ఏప్రిల్ 16 నుండి 30 వరకు ప్రతి గురువారం రాత్రి 20.25 గంటలకు బయలుదేరుతుంది.
రైలు నం. 05552: ఏప్రిల్ 19 నుండి మే 3 వరకు ప్రతి ఆదివారం ఉదయం 07.00 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరుతుంది.
ముఖ్యమైన స్టాపింగ్స్: ఏపీ. తెలంగాణలోని విజయవాడ, గుంటూరు, మార్కాపురం రోడ్, నంద్యాల, ధోన్, గూటి, అనంతపురం, ధర్మవరం స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
3. పోడనూర్ – ఖరగ్‌పూర్ – చెన్నై బీచ్: రైలు నం. 06065 ఏప్రిల్ 16 (గురువారం) రాత్రి 23.00 గంటలకు పోడనూర్ నుండి బయలుదేరుతుంది.
రైలు నం. 06066: ఏప్రిల్ 18 (శనివారం) మధ్యాహ్నం 15.30 గంటలకు ఖరగ్‌పూర్ నుండి బయలుదేరుతుంది.
స్టాపింగ్స్: కాట్పాడి, రేణిగుంట (06065కు మాత్రం), నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ స్టేషన్లలో హాల్ట్స్ ఉంటాయి
కోచ్‌ల వివరాలు: ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. మీ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుని టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవాల్సిందిగా రైల్వే శాఖ సూచించింది.
ఇది కూడా చదవండి: Monthly Pension: మీకు నెలకు రూ.61,000 పెన్షన్ కావాలా? పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో సాధ్యమే.. ఎలాగో చూడండి!
Silver Price: వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. రూ.25 వేలు పెరిగిన వెండి ధర..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




