Intinti Gruhalakshmi: విడాకుల తర్వాత రెండో పెళ్ళి చేసుకుంటే తప్పేంటి ?.. ‘ఇంటింటి గృహలక్ష్మి’ ఫేమ్ ఇంద్రనీల్ కామెంట్స్..
తులసి కొడుకుల మాదిరిగానే సామ్రాట్ కూడా ఆమెకు కొడుకుల కనిపిస్తున్నాడు. అంతేకాదు.. అమ్మమ్మ అయ్యే వయసులో మళ్లీ పెళ్లి ఏంటీ.. అది కూడా కొడుకుల కనిపిస్తున్న వ్యక్తితో ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు
ప్రస్తుతం బుల్లితెరపై టీఆర్పీలో అగ్రస్థానంలో ఉన్న సీరియల్లలో ఇంటింటి గృహలక్ష్మి ఒకటి. ఈ సీరియల్కు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులు.. ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతుంది. ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని.. ముగ్గురు పిల్లలు పుట్టి…వాళ్లకు పెళ్లి చేయాల్సిన సమయంలో మరో మహిళతో ప్రేమలో పడి.. ప్రియురాలి కోసం భార్యతో విడాకులు తీసుకుంటాడు తులసి భర్త. దీంతో ఆమె తన పిల్లలు… అత్త మామలతో కలిసి ఒంటరిగా ప్రయాణం కొనసాగిస్తోంది. తనపై తాను నిలబడి.. పిల్లలకు మంచి భవిష్యత్తు కల్పించాలనే తపనతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నెట్టుకోస్తుంటుంది. అదే సమయంలో భార్య లేకుండా కూతురుతో కలిసి తులసి జీవితంలోకి స్నేహితుడిగా సామ్రాట్ పాత్రతో ఎంట్రీ ఇచ్చాడు ఇంద్రనీల్. అయితే వీరిద్దరి మధ్య స్నేహంపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మీరు స్నేహితులుగా ఉంటే ఓకే.. కానీ తులసిని మాత్రం పెళ్లి చేసుకోవద్దంటున్నారు.
ఎందుకంటే తులసి కొడుకుల మాదిరిగానే సామ్రాట్ కూడా ఆమెకు కొడుకుల కనిపిస్తున్నాడు. అంతేకాదు.. అమ్మమ్మ అయ్యే వయసులో మళ్లీ పెళ్లి ఏంటీ.. అది కూడా కొడుకుల కనిపిస్తున్న వ్యక్తితో ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం కాకుండా.. ప్రేమ, పెళ్లి అంటూ హింట్ ఇస్తూ సీరియల్ లాక్కొస్తుంటే ప్రేక్షకులు విసిగిపోతున్నారు. వారిద్దరు స్నేహితులుగా ఉంటే ఓకే కానీ..పెళ్లి మాత్రం వద్దంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు ఏకంగా ఇంద్రనీల్ కు కాల్ చేసి పెళ్లి చేసుకోవద్దని చెబుతున్నారట. ఇక ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఈ టైమ్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ మాట్లాడుతూ.. ” మనం 2022లో ఉన్నాం.. ఈ సమాజం రెండవ వివాహాన్ని స్వాగతించడాన్ని నేను ఇష్టపడుతున్నాను. పెళ్లైన తర్వాత మనసులు కలవకపోతే విడిపోవడం సహజం. మనసుకి దగ్గరైన ఇష్టమైన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు. రెండవ పెళ్లి అనేది చట్టబద్దంగా చేసుకుంటే తప్పులేదు. అది పాపం అన్నట్టు చూడకూడదు. ప్రతి ఒక్కరికి జీవితంలో తోడు కావాలి. ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని సంతోషంగా గడిపే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి తమ జీవితం పట్ల స్వేచ్ఛ ఉండాలి. తమకు నచ్చిన వ్యక్తితో ఉండడం తప్పేం కాదు. ఎవరి ఇష్టం వారిది. ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు ” అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే ప్రస్తుతం తాను నటిస్తోన్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ పాత్ర కూడా అదే కొవకు చెందినది అని.. తనకు ఇష్టమైన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడానికి తులసి అర్హురాలు. ఆమె రెండో పెళ్లి చేసుకోవడంలో తప్పేం లేదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీంతో త్వరలోనే గృహలక్ష్మిలో తులసి, సామ్రాట్ పెళ్లి చేసుకుంటారేమో అంటున్నారు నెటిజన్స్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.