Aamir Khan: అమీర్ ఖాన్ తల్లి జీనత్ కు తీవ్ర గుండెపోటు.. బ్రీచ్ కాండీ హాస్పటల్ లో చికిత్స

అమీర్ ఖాన్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది. ఆమె చికిత్సకు బాగా స్పందిస్తుందని.. చికిత్స అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

Aamir Khan: అమీర్ ఖాన్ తల్లి జీనత్ కు తీవ్ర గుండెపోటు.. బ్రీచ్ కాండీ హాస్పటల్ లో చికిత్స
Aamir Khan Mother Jeenath
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2022 | 8:40 PM

బాలీవుడ్ నటుడు మిస్టర్ పర్‌ఫెక్ట్..అమీర్‌ఖాన్‌ తల్లి జీనత్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. జీనత్ కు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆస్పత్రి తరలించారు. దీపావళి సందర్భంగా అమీర్ ఖాన్ తన పంచగని ఇంటికి వెళ్లారు. తల్లికి గుండెపోటు వచ్చి పరిస్థితి విషమించడంతో వెంటనే ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడే ప్రస్తుతం జీనత్ కు చికిత్సనందిస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం జీనత్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

మీడియా కథనాల ప్రకారం..  అమీర్ ఖాన్ తల్లి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉంది. ఆమె చికిత్సకు బాగా స్పందిస్తుందని.. చికిత్స అనంతరం ఆమె నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే తన తల్లి ఆరోగ్య విషయంలో అమీర్ ఖాన్ సహా మొత్తం కుటుంబ సభ్యులు ఎటువంటి సమాచరం బయటకు రాకుండా చూసుకుంటున్నారు. తన తల్లి ఆరోగ్యంపై మీడియాలో ఎటువంటి పుకార్లు రాయవొద్దంటూ అమీర్ కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Aamir Khan (@amirkhanactor_)

అమీర్ ఖాన్ కుటుంబానికి చాలా సన్నిహితుడు అమీర్ ఖాన్ ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటాడన్న సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ పాపులర్ టాక్ షోలో  లాల్ సింగ్ చద్దా ప్రమోషన్ సందర్భంగా  కనిపించాడు. అక్కడ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నానని నటుడు చెప్పాడు. షోలో తన కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటానని.. తన ఫ్యామిలీ మెంబర్స్ తో మంచి బంధం ఉందని.. ఈ బలమైన బంధాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటానని చెప్పాడు.

ఇటీవల విడుదలైన చిత్రం లాల్ సింగ్ చద్దా చాలా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అమీర్,  కరీనా కపూర్ , నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయితే, ఈ చిత్రం OTTలో మంచి ఆదరణ పొందింది.  అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ కూడా చేయలేకపోయింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..