Get Rid of Termites: లవంగాలను ఇలా వాడారంటే ఇంట్లో చెద కనిపించదు..

వర్షాకాలం, చలి కాలం వచ్చాయంటే ఇంట్లో కనిపించే సమస్యల్లో చెద కూడా ఒకటి. వాతావరణంలో తేమ కారణంగా ఇంట్లోకి అనేక క్రిములు ప్రవేశిస్తాయి. ఈ క్రిములు ఇంట్లోని వస్తువులు, ఆహారాలు పాడు చేయడమే కాకుండా.. ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు కారణం అవుతాయి. ఈ క్రమంలోనే తేమ కారనంగా ఇంట్లో చెదలు కూడా పడుతూ ఉంటాయి. ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. ఈ చెదలు ఇంటిని గుల్ల చేస్తాయి. ఈ సీజన్‌లోనే చెద పురుగులు సంతానోత్పత్తిని..

Get Rid of Termites: లవంగాలను ఇలా వాడారంటే ఇంట్లో చెద కనిపించదు..
Termites
Follow us

|

Updated on: Oct 12, 2024 | 4:27 PM

వర్షాకాలం, చలి కాలం వచ్చాయంటే ఇంట్లో కనిపించే సమస్యల్లో చెద కూడా ఒకటి. వాతావరణంలో తేమ కారణంగా ఇంట్లోకి అనేక క్రిములు ప్రవేశిస్తాయి. ఈ క్రిములు ఇంట్లోని వస్తువులు, ఆహారాలు పాడు చేయడమే కాకుండా.. ఎన్నో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు కారణం అవుతాయి. ఈ క్రమంలోనే తేమ కారనంగా ఇంట్లో చెదలు కూడా పడుతూ ఉంటాయి. ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. ఈ చెదలు ఇంటిని గుల్ల చేస్తాయి. ఈ సీజన్‌లోనే చెద పురుగులు సంతానోత్పత్తిని ప్రారంభిస్తాయి. దీంతో ఇంట్లో చెద పురుగులు గుట్టలు గుట్టలుగా పెరుగుతాయి. చెదల కారణంగా ఫర్నీచర్ అంతా పాడవుతుంది. భారీగా నష్టం వస్తుంది. కానీ చెదలను అరికట్టే అద్భుతమైన చిట్కాలు కూడా చాలానే ఉన్నాయి. చెదను నివారించడానికి లవంగం అద్భుంగా పని చేస్తుంది. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.

లవంగం:

లవంగాలను కూడా మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కువగా మసాలాలతో చేసిన వంటలు, పులావ్ తయారీలోకి లవంగాలను యూజ్ చేస్తాం. ఈ లవంగం చెదల నివారణకు అద్భుతంగా పనిచేస్తుంది. చెదల పురుగులను వదిలించుకోవడానికి లవంగాలను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

లవంగాల పొడి:

లవంగాలను పొడి చేసి గోరు వెచ్చటి నీటిలో కలపాలి. ఇప్పుడు వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో వేసి ముందుగా ఫర్నీచర్‌, తలుపులు, కిటికీలపై స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల.. ఈ ఘాటు వాసనకు చెదపురుగులు పట్టకుండా ఉంటాయి. ఒక వేళ ఉన్నా నశిస్తాయి.

ఇవి కూడా చదవండి

లవంగాల నీరు:

ఓ ఐదు లవంగాలను లవంగాలను అర లీటర్ నీటిలో వేసి ఓ ఐదు నిమిషాలు మీడియం మంట మీద మరిగించాలి. చల్లారాక ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో వేసి.. తలుపులు, కిటికీలు, ఫర్నీచర్‌పై స్ప్రే చేయాలి. ఈ వాసనకు చెదలు రాకుండా ఉంటాయి.

లవంగాల నూనె:

లవంగాలతో తయారు చేసే నూనె కూడా చెదలను నివారించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఈ నూనె నుంచి కూడా ఘాటు వాసన వస్తుంది. స్ప్రే బాటిల్‌లో లవంగాల ఆయిల్ వేసి.. కిటికీలు,తలుపులు, ఫర్నీచర్ పై చల్లి ఓ క్లాత్ సహాయంతో తుడవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..