One Nation One Election: ఒకే దేశం-ఒకే ఎన్నికకు అడ్డంకులేంటి..? బిల్లులో ఏముంది.. నిపుణులేమంటున్నారు?
జమిలి ఎన్నికలు జరపాల్సి వస్తే.. అందులో మహిళా రిజర్వేషన్లను కూడా అమలు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలంటే.. ముందుగా నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంటుంది. ఆ డీలిమిటేషన్ జరగాలంటే.. జనాభా లెక్కలు తీయాలి. ఒక్క జమిలికి ఇన్ని లింకులు ఉన్నాయా..?

జమిలి ఎన్నికలు ఇప్పట్లో జరగవు. ఇదే బాటమ్ లైన్. మరో పదేళ్ల దాకా.. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి ఛాన్సే కనిపించడం లేదు. దాదాపుగా రాసి పెట్టుకోవచ్చు..! సొంత స్టేట్‌మెంట్లు కావు ఇవి. రాజ్యాంగ నిపుణులు చెబుతున్న లెక్క ఇది. రాజకీయ విశ్లేషకులు సైతం.. 2034లో జరిగే సాధారణ ఎన్నికలకే ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ సాధ్యం అవుతుందనేది ఓ థియరీ. కొన్ని రాజకీయ పార్టీలు 2027కే జమిలి వచ్చేస్తుంది. మహా అయితే మరో రెండున్నరేళ్లే తాము ప్రతిపక్షంలో ఉంటాం అని ఆశ పడుతున్నాయి. అందులో తప్పులేదనుకోండి. కాని, అవన్నీ అడియాశలే అనేది నిపుణుల వాదన. 2029 వరకు ఏయే రాష్ట్రాలకు గడువు ఉందో.. ఆ ప్రభుత్వాలన్నీ యాజ్ ఇట్ ఈజ్‌గా కొనసాగుతాయి. మరోవైపు.. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కూడా 2029లోనే సాధ్యం అవుతుందా లేక 2034లోనే అమలు చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ.. జమిలి ఎన్నికలపై గానీ, మహిళా రిజర్వేషన్లపై గానీ… ఇంత హడావుడి చేసి వీటి అమలు ఇప్పుడు కాదు.. మరో పదేళ్లకు జరుగుతాయి అని ఎందుకు అంటున్నారు? దాని వెనక ఉన్న లాజిక్ ఏంటి? ఎందుకని దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపడానికి, మహిళా రిజర్వేషన్ల అమలుకు పదేళ్లు ఎందుకు పడుతుందో తెలుసుకుందాం..! (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); జమిలి ఎన్నికలు జరపాలన్నది బీజేపీ కల ముందుగా వన్ నేషన్-వన్ ఎలక్షన్ గురించి చూద్దాం. జమిలి ఎన్నికలు జరపాలన్నది భారతీయ జనతా పార్టీ కల. 2014లో...
