Weight Gain: చాలా బక్కగా ఉన్నారా.. బరువు పెరగాలంటే ఈ ఫుడ్స్ బెస్ట్!

బరువు తగ్గడమే కాదు.. బరువు పెరగాలనుకునే వారు కూడా ఎక్కువే. చాలా మంది బక్కగా ఎముకలు బయటకు కనిపించే విధంగా ఉంటారు. వీళ్లను చూస్తూ ఉంటే గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోతారేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా సరై శరీరం హైట్‌కి తగ్గట్టుగా బరువు అనేది ఉండాలి. అలా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. బరువు ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా ఇబ్బందే. సరైన బరువు మెయిన్ టైన్ చేస్తూ ఉండాలి. బరువు పెరగడం కోసం చాలా మంది ఏవి పడితే అవి తింటూ ఉంటారు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్..

Weight Gain: చాలా బక్కగా ఉన్నారా.. బరువు పెరగాలంటే ఈ ఫుడ్స్ బెస్ట్!
Oats vs Wheat Bran
Follow us
Chinni Enni

|

Updated on: Oct 07, 2024 | 2:34 PM

బరువు తగ్గడమే కాదు.. బరువు పెరగాలనుకునే వారు కూడా ఎక్కువే. చాలా మంది బక్కగా ఎముకలు బయటకు కనిపించే విధంగా ఉంటారు. వీళ్లను చూస్తూ ఉంటే గట్టిగా గాలి వేస్తే ఎగిరిపోతారేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా సరై శరీరం హైట్‌కి తగ్గట్టుగా బరువు అనేది ఉండాలి. అలా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. బరువు ఎక్కువగా ఉన్నా.. తక్కువగా ఉన్నా ఇబ్బందే. సరైన బరువు మెయిన్ టైన్ చేస్తూ ఉండాలి. బరువు పెరగడం కోసం చాలా మంది ఏవి పడితే అవి తింటూ ఉంటారు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తినడం వల్ల బరువు పెరుగుతారు. కానీ ఇది ఆరోగ్యకరమైనది కాదు. ఎందుకంటే ఈ ఆహారాలు తినడం వల్ల బాడీలో చెడు కొవ్వు పెరుగుతుంది. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తింటూ కూడా బరువు పెరగవచ్చు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఖర్జూరం:

తరచుగా మీ డైట్‌లో ఖర్జూరం తినడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా పిండి పదార్థాలు, పొటాషియం కూడా లభిస్తుంది. ఖర్జూరంతో చేసిన స్వీట్లు, స్మూతీలు మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. దీంతో ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు.

డ్రై ఫ్రూట్స్:

డ్రై ఫ్రూట్స్ యూజ్ చేయడం వల్ల కూడా బరువు పెరగవచ్చు. సాధారణంగా తీసుకునే మోతాదుకు మించి ఎక్కువగా తీసుకవాలి. ఇందులో అనేక పోషకాలు, విటమిన్లు, మినరల్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి వెయిట్ పెరిగేందుకు సహాయ పడతాయి.

ఇవి కూడా చదవండి

మొలకలు:

మొలకలు తినడం వల్ల బరువు తగ్గవచ్చు.. పెరగవచ్చు. వెయిట్ తగ్గాలి అనుకునే వారు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వెయిట్ గెయిన్ కావాలి అనుకునే వాళ్లు మాత్రం ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో కేలరీల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తప్పకుండా తీసుకోండి.

ఫ్రూట్స్:

ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మీరు ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. ప్రతి రోజూ మీ డైట్‌లో మూడు లేదా నాలుగు రకాల పండ్లు లేదా వీటితో చేసిన స్మూతీలను తాగవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్య కరంగా బరువు పెరుగుతారు.

పెరుగు:

పెరుగు తినడం వల్ల కూడా హెల్దీగా వెయిట్ గెయిన్ కావచ్చు. ఇందులో శరీరానికి అవసరం అయ్య పోషకాలు లభిస్తాయి. పొట్ట నిండుగా తినాలి. ఇలా తినడం వల్ల త్వరలోనే వెయిట్ గెయిన్ అవుతారు. మీ డైలీ రొటీన్‌లో పెరుగు అన్నం తినేలా ప్లాన్ చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!