వీరికి అరటిపండు విషంతో సమానం.. తిన్నారంటే షెడ్డుకే.!

20 December 2024

Ravi Kiran

అరటిపండ్లలో పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం, ఇతర విటమిన్లు వంటి కీలక పోషకాలున్నాయి.

అరటి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి మంచిది.. పేగులోని ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. 

అయితే కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండును తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పొట్ట సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. అలా తినడం వల్ల ఎసిడిటీ లేదా గ్యాస్ వస్తుంది.

స్థూలకాయులు అరటిపండును తీసుకోవొద్దు. అరటిపండు తినడం వల్ల బరువు మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో తింటే, శరీరానికి అధిక కార్బోహైడ్రేట్లు, కేలరీలు అందుతాయి.

రక్తహీనత సమస్యతో బాధపడే వారు కూడా పరగడుపున అరటిపండును తినకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్ ఉన్నవారు కూడా అరటి పండును తినకూడదు. తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.