Diya Aur Baati Hum: ‘ఈతరం ఇల్లాలు’ సీరియల్ హీరోయిన్ ఇప్పుడేలా మారిపోయిందో చూస్తే షాకవుతారు.. హీరోయిన్లను మించిన అందం..
సూర్య, సంధ్య పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సీరియల్ పూర్తైన సంవత్సరాలు గడుస్తున్నా..

‘ఈతరం ఇల్లాలు’ అప్పట్లో ఈ సీరియల్ తెలుగు బుల్లితెరపై సెన్సెషన్ క్రియేట్ చేసింది. హిందీ సీరియల్ అయినా.. తెలుగులో డబ్ చేసి ప్రసారం చేయగా.. నెంబర్ వన్‌గా కొన్నేళ్లు కొనసాగింది. దియా ఔర్ బాతీ పేరుతో హీందిలో వచ్చిన ఈ సీరియల్లో సూర్య, సంధ్య పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. సీరియల్ పూర్తైన సంవత్సరాలు గడుస్తున్నా..ఇప్పటికీ తెలుగు అభిమానులు మాత్రం మర్చిపోలేదు. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ రీమేక్‌గా జానకి రామ సీరియల్ వస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈతరం ఇల్లాలు సీరియల్ అంత టీఆర్పీ రేటింగ్ రావడం లేదు. ఇందులో హీరోయిన్ సంధ్య పాత్రలో ఎంతో సంప్రదాయంగా.. అమాయకంగా కనిపించిన అమ్మాయి పేరు దీపికా సింగ్. అమాయక చూపులు.. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివే అమ్మాయికి విధి చేసిన అన్యాయం తల్లిదండ్రులను దూరం చేయడం..
అండగా ఉండాల్సిన అన్నయ్య స్వార్ధం కోసం అబద్ధాలు చెప్పి చెల్లికి పెళ్లి చేయడం.. ఆ తర్వాత భర్త సాయంతో ఆ అమ్మాయి పోలీస్ అధికారిగా ఎలా మారింది.. ఆ తర్వాత ఎలాంటి పరిస్తితులను ఎదుర్కొంది అనేది ఈ సీరియల్. ఇందులో సంధ్యగా ఎంతో సంప్రదాయంగా కనిపించిన అమ్మాయి దీపికా సింగ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్.




1989 జూలై 26న న్యూఢిల్లీలో జన్మించిన దీపికాకు చినప్పటి నుంచి నటనపై ఆసక్తి ఎక్కువే. ఆమె ప్రధాన పాత్రలో 2011లో హిందీలో దియా ఔర్ బాతీ సీరియల్ ప్రసారమైంది. ఇదే సీరియల్‌ను తెలుగులోకి డబ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 5 సంవత్సరాలు ఈ సీరియల్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగిందంటే అతిశయోక్తి కాదు.
అదే సమయంలో ఈతరం ఇల్లాలు సీరియల్ డైరెక్టర్లలలో ఒకరైన రోహిత్ రాజ్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో వీరు 2014 మే 2న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న దీపికా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు రీల్స్..ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. అంతేకాదు.. దీపికా ఒడిషా క్లాసికల్ డ్యాన్సర్ కూడా.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




