AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Singh: సీరియల్ షూటింగ్‏లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన నటి.. ఇప్పుడేలా ఉందంటే..

ప్రస్తుతం ఆమె మంగళ లక్ష్మీ అనే సీరియల్లో నటిస్తుంది. ఇందులో మంగళ అనే పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సీరియల్ షూటింగ్ సెట్ లో దీపికా గాయపడినట్లు తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో ఈ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా సెట్ లో ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Deepika Singh: సీరియల్ షూటింగ్‏లో ప్రమాదం.. తీవ్రంగా గాయపడిన నటి.. ఇప్పుడేలా ఉందంటే..
Deepika Singh
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2024 | 2:12 PM

Share

దియా ఔర్ బాతీ సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది దీపికా సింగ్. ఇదే సీరియల్ ను తెలుగులో ఈతరం ఇల్లాలు పేరుతో డబ్ చేయగా.. తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సీరియల్ ద్వారా చాలా కాలం గ్యాప్ తీసుకున్న దీపికా, ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె మంగళ లక్ష్మీ అనే సీరియల్లో నటిస్తుంది. ఇందులో మంగళ అనే పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సీరియల్ షూటింగ్ సెట్ లో దీపికా గాయపడినట్లు తెలుస్తోంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ముంబైలోని గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో ఈ సీరియల్ షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా సెట్ లో ప్రమాదం జరిగినట్లు సమాచారం.

దీపికతో ఓ అవార్డ్ ఫంక్షన్ సీన్ షూట్ చేస్తున్న సమంయలో గాలి బలంగా రావడంతో వెనుక ఉంచిన ప్లైవుడ్ బోర్డు దీపికపై పడిపోయింది. దీంతో గట్టిగా కేకలు వేస్తూ కిందపడిపోయింది దీపికా. ఆమె అరుపులు విన్న ప్రొడక్షన్ టీమ్ వెంటనే అక్కడకు చేరుకుని దీపికపై పడిన ప్లైవుడ్ బోర్డుని తీశారు. దీపిక వెన్నుకు తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తోంది. గాయపడిన స్థితిలో కూడా దీపిక షూటింగ్ కొనసాగించేందుకు ప్రయత్నించింది. ఇందుకు నొప్పిని తగ్గించుకోవడానికి ఐస్ ప్యాక్‌లను కూడా ఉపయోగించిందని.. కానీ వెన్నులో వాపు రావడంతో షూటింగ్‌ని మధ్యలోనే వదిలేసి వెల్లిపోయినట్లు తెలుస్తోంది.

వెన్నుకు తీవ్ర గాయం కావడంతో ఆమెకు కొన్నివారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీపికా సింగ్ ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దియా ఔర్ బాతీ సీరియల్ ద్వారా నటిగా కెరీర్ ప్రారంభించిన దీపికా.. అదే సీరియల్ డైరెక్టర్ రోహిత్ గోయల్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు.

View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.