Brahmamudi, January 11th Episode: అదిరే దెబ్బ కొట్టిన కావ్య.. వెర్రి పుష్పం అయిన రుద్రాణి..
స్వప్న సీమంతం చేయాలని పెద్ద ప్లాన్ వేసి కావ్యని ఇరికించాలని చూస్తుంది రుద్రాణి. కానీ కావ్యనే రుద్రాణికి రివర్స్ దెబ్బ కొడుతుంది. స్వప్న సీమంతం సింపుల్‌గా మా ఇంట్లోనే చేస్తానని కనకం అంటుంది. తన మాటలతో అందర్నీ ఒప్పిస్తుంది. దీంతో కావ్య, రాజ్‌లు ఊపిరి పీల్చుకుంటారు. మరోవైపు రుద్రాణికి 100 కోట్ల నిజం తెలిసేలా ఉంటుంది..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. స్వప్న సీమంతానికి కావాల్సిన మొత్తం లిస్ట్ రుద్రాణి, రాహుల్‌లు కలిసి తయారు చేస్తారు. మొత్తం 20 లక్షలు అవుతుందని చెబుతూ కావ్యని చెక్ ఇమ్మని అంటుంది రుద్రాణి. ఏంటి 20 లక్షలు కావ్య ఇస్తుందా అని ప్రకాశం అంటే.. ఇవ్వని చెబుతా.. మనకు ఒక్క రూపాయి ఇవ్వడం లేదు కానీ.. వాళ్ల అక్కకు అన్ని లక్షలు ఇస్తే ఊరుకుంటానా అని ధాన్యలక్ష్మి అనుకుంటుంది. మీరు అడుగుతారని నేను కూడా చెక్ రాసి ఇక్కడే పెట్టాని కావ్య అంటుంది. దీంతో రుద్రాణి, రాహుల్‌లు సంతోష పడతారు. ఇక చెక్ రుద్రాణికి ఇస్తుంది కావ్య. అప్పుడే కనకం ఎంట్రీ ఇస్తుంది. అమ్మా స్వప్నా.. ఎలా ఉన్నావు? నా ప్రేమ నీకు గుర్తుకు రావడం లేదా? అని మాట్లాడుతుంది. సమయానికి వచ్చావు కనకం.. నీకే కబురు చేద్దాం అనుకున్నాం.. కానీ ఇంతలో నువ్వే వచ్చావని అపర్ణ అంటుంది. ఏదన్నా విశేషమా వదినా అని కనకం ఏమీ తెలియనట్టు అడుగుతుంది.
ఎంట్రీ ఇచ్చిన కనకం..
అవును.. మా రుద్రాణి.. స్వప్న సీమంతాన్ని తన చేతుల మీదుగా చేయాలని ఏర్పాట్లు చేస్తుంది అంటూ అపర్ణ అనగానే.. నో అంటూ పెద్దగా అరుస్తుంది కనకం. దీనికి అందరూ ఉలిక్కి పడతారు. అలా ఎలా జరుగుతుంది.. ఇక్కడ ఎలా జరుగుతుంది? దీన్ని ఆపేదెలా.. ఏమిటీ అగ్ని పరీక్ష నాకు అంటూ కనకం అంటుంది. ఎవరికీ ఏమీ అర్థం కాక చూస్తారు.. జీవితంలో పనికి వచ్చే ఏ ఒక్క పని కూడా చేయని రుద్రాణి గారు.. ఇవాళ కోడలి సీమంతం చేస్తానని ఉత్సాహం చూపించడం ఏంటి. దీని వెనుక ఉన్న మర్మం ఏంటి? మతలబు ఏంటి? రుద్రాణి గారు సీమంతం చేస్తుంది అంటే.. మీ ఇంటి చివర ఉన్న కుక్క కూడా నమ్మదే.. కానీ మీరెంతా ఎలా నమ్ముతున్నారు? నేను ఒప్పుకోను అంటూ కనకం అంటుంది. నువ్వు ఒప్పుకునేది ఏంటి? మా ఇంటి పేరంటం మేము చేస్తుంటే.. మధ్యలో నీ పర్మిషన్ మాకు ఎందుకు? అంటూ రుద్రాణి అంటుంది.
సింపుల్‌గా సీమంతం చేస్తాను..
అంటే నా కూతుర్ని నేను మీకు అమ్మేసుకున్నానా.. ఇప్పటికీ మా స్వప్న మీద తల్లిగా నాకు సర్వ హక్కులు ఉన్నాయి. మా ఇంటి సంప్రదాయం ప్రకారం.. వంశాచారం ప్రకారం.. స్వప్న సీమంతం మా ఇంట్లోనే చేయాలని మా పూర్వీకుల తీర్మానం అంటూ కనకం అంటుంది. దీంతో రుద్రాణి కంగారు పడుతుంది. ఏంటి ఆ పూరింట్లో సింపుల్‌గా సీమంతం చేయాలి అనుకుంటున్నావా.. మా ఇంట్లో నీ కూతురి సీమంతం ఎలా జరిపిస్తామో తెలుసా.. చూసిన వాళ్లు నా భూతో నా భవిష్యత్ అనుకుంటారని రుద్రాణి అంటుంది. నాకు అసలు అర్థం కావడం లేదు.. నా కూతురి మీద మీకు ఎంతుకు అంత ప్రేమ పుట్టుకొచ్చింది? అసలు ఇక్కడ ఎవరైనా నమ్ముతున్నారా? అని కనకం అందర్నీ అడుగుతుంది. అదే మాకు అర్థం కావడం లేదని అందరూ అంటారు.
కనకం ఓవరాక్షన్.. ఒప్పుకున్న ధాన్యలక్ష్మి..
ఎవరు ఏం అనుకున్నా.. నా ఇంట్లోనే అందరి సమక్షంలో చేస్తానని రుద్రాణి అంటే.. కనకం ఏడుస్తూ.. మా ఇంటి సంప్రదాయాన్ని మట్టిలో కలిపేస్తారా? ఇంత మంది ఉన్నారు.. నాకు న్యాయం చెప్పే వాళ్లు లేరా.. మీరు చెప్పండి ధాన్యలక్ష్మి గారూ.. సీమంతానికి ఇంత ఆర్భాటం అవసరమా.. రాహుల్, రుద్రాణిల పర్సుల నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా.. ఈ ఇంటి అకౌంట్‌లో నుంచి 20 లక్షలు తీసి ఇంత దుబారా ఖర్చు చేయడం అవసరమా మీరే చెప్పండి అంటూ అడుగుతుంది. దీంతో ధాన్యలక్ష్మి.. అవును మీ ఇంట్లో జరిపించడమే మంచిదని అంటుంది.ఆహా నిజంగా న్యాయం చెప్పారు.. విన్నారుగా రుద్రాణి గారు.. స్పప్న సీమంతం మా ఇంట్లోనే జరుగుతుంది. నాకు ఉన్నదానిలో చేస్తానని కనకం అంటుంది. దానికి స్వప్న నేను ఒప్పుకోను అని అంటుంది. నీకేమైందే.. లక్షలకు లక్షలు ఖర్చు పెడితే తప్పా నీకు సీమంతం జరిపించినట్టు ఉండదా.. నీకు ఈ కన్న తల్లి కడుపు తీపి నీకు తెలీడం లేదా? అని కనకం ఓవరాక్షన్ చేస్తే.. స్వప్న సరే అంటుంది.
కావ్య, కనకంల ప్లాన్ సక్సెస్..
స్వప్నా మీ వంశాచారం ప్రకారం.. నీ సీమంతం నీ పుట్టింట్లో జరిపించడమే మంచిది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే నీ సీమంతం నీ పుట్టింట్లో జరిపించడమే మంచిదని అపర్ణ, ఇందిరా దేవిలు అంటారు. దీంతో సరే అని ఒప్పుకుంటుంది స్వప్న. రుద్రాణి గారు ఇప్పుడేంటి.. ఆ 20 లక్షల చెక్‌తో అవసరం లేదు కదా.. ఇటు ఇవ్వండి అంటూ తీసుకుని చించేస్తుంది కావ్య. సరే రేపు మా ఇంట్లో జరగబోయే అందరూ రావాలని కనకం చెప్పి వెళ్తుంది. మరోవైపు కళ్యాణ్ పాట రాస్తాడు. అప్పుడే వెంటనే అప్పూ ఫోన్ చేస్తుంది. ఇక పాట పాడి వినిపిస్తాడు కళ్యాణ్. అదివిని ఎంతో సంతోష పడుతుంది అప్పూ. మరోవైపు ఫ్రస్ట్రేషన్‌తో ఊగిపోతుంది రుద్రాణి. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..