Aamir Khan: ‘ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది’.. ఆమిర్ ఖాన్‌ కామెంట్స్ వైరల్

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ నటించిన రెండో చిత్రం లవ్యాపా. ఈ సినిమా ట్రైలర్ లాంఛింగ్ కార్యక్రమం ఇటీవలే అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమిర్ మాట్లాడుతూ.. తాను శ్రీదేవికి వీరాభిమానిని చెప్పుకొచ్చారు.

Aamir Khan: 'ఈ హీరోయిన్‌ను చూస్తే శ్రీదేవినే చూసినట్లుంది'.. ఆమిర్ ఖాన్‌ కామెంట్స్ వైరల్
Aamir Khan, Sridevi
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2025 | 1:02 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన బాలీవుడ్‌లోని చాలా మంది దిగ్గజ నటీమణులతో పనిచేశాడు. జూహీ చావ్లా, కాజోల్, కరీనా కపూర్, కరిష్మా కపూర్‌లతో సహా బాలీవుడ్‌లోని చాలా మంది పెద్ద నటీమణులతో యాక్ట్ చేశారు. అయితే ఓ నటి తో కలిసి నటించాలన్న తన కోరిక తీరలేదని ఆవేదన వ్యక్తం చేశాడీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. తన కొడుకు ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్‌లో ఆమిర్ ఈ విషయాల గురించి మాట్లాడాడు. ఆమిర్ ఖాన్ తన కుమారుడు జునైద్ ఖాన్ మ దివంగత నటి శ్రీదేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ నటించిన ‘లవ్యపా’ ట్రైలర్ లాంఛింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమా చేసినందుకు వారిద్దరికీ అమీర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన బాలీవుడ్ నటి శ్రీదేవిని కూడా గుర్తకుతెచ్చుకున్నారు. శ్రీదేవికి తాను వీరాభిమానిని అని అన్నారు. ఆమెతో కలిసి నటించాలన్న తన కోరిక నెరవేరలేదన్నాడు. శుక్రవారం (జనవరి 10) జునైద్ ఖాన్, శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ లవ్యాపా సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ఆమిర్ హాజరయ్యాడు. సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు.

శ్రీదేవితో కలిసి నటించాలన్నది నా కల. కానీ అది సాకారం కాలేదు. ఈ సినిమాతో పాటు ఈ క్షణం నాకు చాలా ప్రత్యేకమైనది. నేనెప్పుడూ శ్రీదేవికి వీరాభిమానిని. ఖుషీ సినిమా చూసిన తర్వాత మళ్లీ శ్రీదేవిని చూశాననిపించింది. శ్రీదేవితో కలిసి నటించే అవకాశం రాకపోయినా.. నా కొడుకు జునైద్ ఖుషీ కపూర్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది’ అని ఆమిర్ చెప్పుకొచ్చారు.

లవ్ టుడే కు రీమేక్ గా..

జునైద్, ఖుషీ తొలిసారిగా పెద్ద తెరపై కనిపించనున్నారు. వీరిద్దరికీ వెండితెరపై ఇదే తొలిచిత్రం. ఖుషీ మొదటి చిత్రం ‘ది ఆర్చీస్’. జునైద్ ఫస్ట్ మూవీ ‘మహారాజ్’ సినిమాలు రెండూ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

జునైద్, ఖుషీ కపూర్ ల సినిమా ట్రైలర్..

.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.