Brahmamudi, May 21st episode: కావ్యకు ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చిన మాయ.. బిడ్డకు తండ్రి రాజే!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. భద్రాచలం నుంచి తీసుకొచ్చిన అక్షింతలను.. కావ్య, స్వప్న, అపర్ణ, ఇందిరా దేవి, ధాన్య లక్ష్మిలు వాళ్ల భర్తల చేత వేయించుకుంటారు. ఈలోపు రుద్రాణి పుల్లలు పెడితే.. కావ్య, స్వప్నలు కలిసి చివాట్లు పెడతారు. ఏంటి ఇక్కడే అలా నిలబడ్డావ్. మా అత్తలాగే ఏకాకిలా నిలబడిపోతావా.. వెళ్లి కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకో అని స్వప్న చెప్తే.. అనామిక అక్షింతలను తీసుకుని కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంది. కళ్యాణ్ కవితల్లో ములిగిపోయి ఉంటాడు. కళ్యాణ్.. అని అనామిక అంటే..

Brahmamudi, May 21st episode: కావ్యకు ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చిన మాయ.. బిడ్డకు తండ్రి రాజే!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: May 21, 2024 | 12:19 PM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. భద్రాచలం నుంచి తీసుకొచ్చిన అక్షింతలను.. కావ్య, స్వప్న, అపర్ణ, ఇందిరా దేవి, ధాన్య లక్ష్మిలు వాళ్ల భర్తల చేత వేయించుకుంటారు. ఈలోపు రుద్రాణి పుల్లలు పెడితే.. కావ్య, స్వప్నలు కలిసి చివాట్లు పెడతారు. ఏంటి ఇక్కడే అలా నిలబడ్డావ్. మా అత్తలాగే ఏకాకిలా నిలబడిపోతావా.. వెళ్లి కళ్యాణ్ ఆశీర్వాదం తీసుకో అని స్వప్న చెప్తే.. అనామిక అక్షింతలను తీసుకుని కళ్యాణ్ దగ్గరకు వెళ్తుంది. కళ్యాణ్ కవితల్లో ములిగిపోయి ఉంటాడు. కళ్యాణ్.. అని అనామిక అంటే.. ఇప్పటి వరకూ ఆలోచించిన ప్రాస నీ లెగ్, టంగ్‌తో పోయిందని అంటాడు. ప్రాస మీద ఉండే ధ్యాస.. పెళ్లాం మీద ఉంటే బావుంటుందని అనామిక అంటే.. ఇప్పుడేంటి గొడవ పడటానికి వచ్చావా అని కళ్యాణ్ అడిగితే.. పూజారి గారు భద్రాచలం నుంచి అక్షింతలు తీసుకొచ్చారు. అందరూ వారి భార్యలను ఆశీర్వదించారు. కనీసం ఇప్పుడైనా అక్షింతలు తీసుకుని ఆలోచించు అని అనామిక అంటే.. అరిచి గోల చేసి.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్షింతలు వేయమంటే ఏ మొగుడూ వేయడు. నీ లాంటి సూర్పణఖ నెత్తిన.. ఆ పరమ పవిత్రమైన అక్షింతలు వేయకూడదు. వెళ్లు వెళ్లు.. కలకాలం కష్టసుఖాల్లో నీకు తోడోగా నీడగా ఉంటానని చెప్పడానికి వేస్తారు. కానీ నేను నీతో కలిసి ఉండటానికి ఇష్ట పడటం లేదు. విడిపోవడానికే నిర్ణయించుకున్నాను అని కళ్యాణ్ చెప్పగానే.. అనామిక షాక్ అవుతుంది. అప్పటికే కళ్యాణ్ మాట్లాడేది అంతా కావ్య వింటుంది.

మీ కాపురాన్ని సరిచేసుకోండి కవి గారూ..

కళ్యాణ్ లోపలికి రాగానే.. ఏంటి వదినా అలా చూస్తున్నారు అని అడుగుతాడు. ఏం లేదు కవి గారూ.. మీ చదువు.. సంస్కారం ఏకమైపోయిందని ఆలోచిస్తున్నా.. ఈ దారి సరైనది కాదు. భార్యను మీ దారికి తీసుకు రాకుండా.. మీ దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. విడిపోవడం అంత సులువని అనుకుంటున్నారా.. ఏ కష్టం అయినా పంచుకోవడానికి జీవిత భాగస్వామి ఉండాలి. జీవితంలో ఒక్కరితోనే కాపురం చేసుకోవాలి. నేను కాపురానికి వచ్చిన కొత్తలో నన్ను అందరూ ద్వేషించారు. నా భర్త కూడా శత్రువులాగానే చూశాడు. నా కాపురం కోసం అప్పటి నుంచి ఇప్పటివరకూ పోరాటం చేస్తూనే ఉన్నాను. కాబట్టి మీరు మీ కాపురాన్ని సరి చేసుకునే మార్గాన్ని వెతకండి. ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుందని చెప్పి కావ్య వెళ్లిపోతుంది.

మాయని కనిపెట్టేసిన అప్పూ, కావ్యలు..

ఈ సీన్ కట్ చేస్తే.. అప్పూ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కావ్య రాగానే.. మాయ ఇంటికి వెళ్తారు. డోర్ కొడతారు.. డోర్ తీసిన మాయ.. వెంటనే వీళ్లను చూసి డోర్ క్లోజ్ చేస్తుంది. అప్పూ బలవంతంగా లోపలికి వెళ్తుంది. ఎవరు మీరు ఇలా వచ్చారు? అని మాయ అడిగితే.. నువ్వు మాకు తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చాం అని కావ్య అంటుంది. ఎహే డ్రామాలు ఆపు.. నువ్వు మాకు తెలుసని నీకు తెలిసింది. మేము నీకు తెలుసని మాకు తెలిసిపోయింది. ఇక ఓవర్ ఆక్షన్ ఆపి.. అసలు విషయం చెప్పు అని లాక్కెళ్లి కూర్చోబెడతారు. కావ్య, అప్పూ చెరో పక్కన కూర్చొంటారు. కావ్య మాటల్లో పెడితే.. నాకేం తెలీదు కావ్య అని మాటల్లో మాయ అనేస్తుంది. ఇంకెందుకు లేట్.. అసలు విషయం చెప్పేస్తావా? అని కావ్య అడిగితే.. నాకేం తెలీదని అంటుంది. నీకు మా మావయ్య గారు సుభాష్ తెలుసు. ఆ బిడ్డ నీ బిడ్డ అని తెలుసు. నీకూ మావయ్య గారికి అసలు సంబంధం లేదని ఒప్పుకో అని కావ్య అంటే.. నాకేం తెలీదని మాయ అంటుంది.

ఇవి కూడా చదవండి

నా భర్త నిరపరాధి అని రుజువు చేయి…

ఈలోపు అప్పూ.. ఎహే ఎందుకు దీన్ని పొడిచి పేగులు బయటకు తీయమంటావా అక్కా అని అంటే.. నువ్వెందుకు జైలుకు వెళ్లడం.. పోలీసుల దగ్గరకే తీసుకెళ్దాం అని కావ్య అంటుంది. వద్దు వద్దు.. నేను డబ్బు కోసమే ఇదంతా చేశాను. ఏం సంబంధం లేదు. ఒక్కసారి తప్పు చేశాం. డబ్బున్నవాడు కదా.. డబ్బు కోసం బెదిరించాను అని చెప్తుంది. దీంతో మాయకు లాగి పెట్టి ఒక్కటి ఇస్తుంది కావ్య. ఇప్పుడు అందరం పీకల్లోతు కూరుకుపోయాం. నన్ను పారిపొమ్మంటారా అని మాయ అంటే.. రా వచ్చి ఆ బిడ్డ నీ బిడ్డేనని చెప్పు. మా అత్తగారి కాళ్లు పట్టుకుని క్షమాభిక్ష అడుగు. నా భర్త నిరపరాధి అని రుజువు చేయాలి. ఇంతకాలం అందరూ ఆయన్ని మానసికంగా బాధ పెట్టినందుకు ఆ కుటుంబం అంతా పశ్చాత్తాపం పడాలని కావ్య అంటుంది. ఇక అప్పూ, కావ్య ఇద్దరూ కలిసి.. మాయను తీసుకెళ్తారు.

ఇంట్లోంచి కావ్య వెళ్లిపోయిందేమో..

ఈ సీన్ కట్ చేస్తే.. అపర్ణ బయటకు వస్తుంది. అత్తయ్యా మీ ముద్దుల మనవరాలు ఏది? అని అడుగుతుంది. కావ్యనా అని పెద్దావిడ అడిగితే.. ఆవిడే ఏదో రుజువు చేస్తానని ప్రగల్భాలు పలికింది కదా.. ఏది ఎక్కడ? అని అపర్ణ అడుగుతుంది. తను కూర్చొన్న కొమ్మని తనే నరుక్కోవడానికి ఆ పిచ్చిది వెళ్లింది అన్నమాట.. మంచిది. ఇవాళ ఈ ఇల్లు రచ్చబండగా మారుతుందేమో.. రానివ్వు చూద్దాం అని ఇందిరా దేవి అంటుంది. అంత లేదు ఇవాళ కూడా తిరిగి వచ్చి ‘ఓడిపోయాను’ అని చెప్తుంది. లేదంటే ఓడిపోయానని చెప్పడగానికి మొహం చెల్లక ఇంట్లో నుంచి వెళ్లిపోయిందేమో అని రుద్రాణి అంటే.. అవునా.. అలా ఎలా వెళ్లిపోతుంది. మీరూ మీ కొడుకే అన్నీ వదిలేసుకుని మొహాలు చూపిస్తూ ఇంట్లో పడి ఉంటున్నారు కదా.. అలాంటిది ఏ తప్పూ చేయని నా చెల్లు ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి అని స్వప్న అంటే.. కావాలంటే చూడు కావ్య ఈ ఇంటికి తిరిగి రాదని రుద్రాణి అంటుంది.

మాయను ఇంటికి తీసుకొచ్చిన కావ్య..

అప్పుడే ఆ అవసరం నాకు లేదు అని కావ్య అంటుంది. అందరూ షాక్ అవుతారు. అనుకున్నది ఆలస్యం కావచ్చు కానీ.. సాధించే తీరతాను. మాయ ఇంట్లోకి పిలుస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అత్తయ్యా నేను మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. ఆ బిడ్డ తల్లిని తీసుకువచ్చాను. నువ్వు అలా నీతికి.. నిజానికి ప్రతిరూపంలా నిలబడితే ఎలా.. నీ గురించి చెప్పు అని కావ్య అంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో ఆ బిడ్డకు జన్మ ఇచ్చిన తల్లిని నేనే.. తండ్రి రాజ్ అని చెప్తుంది మాయ. దీంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే