Brahmamudi, January 24th episode: శ్వేత గురించి కావ్యకు చెప్పిన కళ్యాణ్.. టెన్షన్‌లో అనామిక!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేతతో రాజ్ ఉన్న విషయాలను గుర్తు చేసుకుంటూ బాధ పడుతుంది కావ్య. ఇంటి బయట మంచులో కూర్చుని కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజ్ వస్తాడు. పక్కన కూర్చుని హాస్పిటల్‌కి వెళ్లి వచ్చావంట కదా.. ఏమన్నారు అని రాజ్ అడిగితే.. మందులు రాసి ఇచ్చారు అని చెబుతుంది. వేసుకున్నావా అని రాజ్ అంటే.. లేదని చెబితే కావ్య అంటుంది. మరి ఇక్కడ మంచులో ఎందుకు కూర్చున్నావ్ వెళ్లి పడుకోవచ్చు కదా అని రాజ్ అంటే.. సరే అని వెళ్తుంది కావ్య. నువ్వు ఫోన్ చేసినప్పుడు అని రాజ్ చెప్పబోతే..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. శ్వేతతో రాజ్ ఉన్న విషయాలను గుర్తు చేసుకుంటూ బాధ పడుతుంది కావ్య. ఇంటి బయట మంచులో కూర్చుని కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజ్ వస్తాడు. పక్కన కూర్చుని హాస్పిటల్‌కి వెళ్లి వచ్చావంట కదా.. ఏమన్నారు అని రాజ్ అడిగితే.. మందులు రాసి ఇచ్చారు అని చెబుతుంది. వేసుకున్నావా అని రాజ్ అంటే.. లేదని చెబితే కావ్య అంటుంది. మరి ఇక్కడ మంచులో ఎందుకు కూర్చున్నావ్ వెళ్లి పడుకోవచ్చు కదా అని రాజ్ అంటే.. సరే అని వెళ్తుంది కావ్య. నువ్వు ఫోన్ చేసినప్పుడు అని రాజ్ చెప్పబోతే.. ఆఫీస్‌లో ఉన్నారు. అర్జెంట్ మీటింగ్‌లో ఉన్నారని చెప్తుంది కావ్య. హా అంతే అంటాడు రాజ్. మీరు బిజీగా ఉంటారని నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది కావ్య.
రగిలిపోతున్న అపర్ణ.. తగ్గేదెలే అంటోన్న ధాన్య లక్ష్మి..
ఇక గదిలో కూర్చుని అపర్ణ రగిలిపోతూ ఉంటుంది. అపర్ణను చూసిన సుభాష్ మళ్లీ ఈ ఇంట్లో ఏదో యుద్ధం జరిగినట్టు ఉంది. కదిలించకపోవడమే బెటర్ అని సైడ్ అవుదామని అనుకుంటారు సుభాష్. వెంటనే అపర్ణ.. ఆగండి.. ఈ ఇంట్లో పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా.. మీ తమ్ముడి భార్యకి కొత్తగా స్వార్థం పెరిగిపోయింది. పరిస్థితులు ఎప్పటిలా లేవని అంటుంది అపర్ణ. లేకపోతే ఎలా చక్కదిద్దాలో నీకు తెలుసు కదా అని సుభాష్ అంటే.. నేను ఎప్పుడైనా రాజ్‌ని ఒకలా.. కళ్యాణ్‌ని ఒకలా చూశానా అని అపర్ణ అడిగితే.. నువ్వే కాదు.. ఇంట్లో ఎవరూ అలా చూడలేదని సుభాష్. కళ్యాణ్‌ని నా చిన్న కొడుకు అనుకున్నా.. రాజ్ కంటే వాడినే ఎక్కువ గారాబం చేశాను. ఎప్పటిలా వాడికి నేనో పని అప్పజెప్పితే పనివాడిలా చూస్తున్నావ్ అంది ఆ ధాన్య లక్ష్మి. నేను ఉరిమి చూస్తూనే భయపడే ధాన్యలక్ష్మి.. ఇప్పుడు అందరి ముందు నన్ను మాట అనేసిందని బాధ పడుతుంది అపర్ణ.
కళ్యాణ్‌ని బానిసలా చూస్తోందన్న ధాన్య లక్ష్మి.. కొమ్ములు రాలేదన్న ప్రకాష్..
ధాన్య లక్ష్మి అన్నదానిలో తప్పేం లేదు. ఇప్పుడు కళ్యాణ్‌కి పెళ్లి అయింది. తన భార్య ముందు కొడుకును తక్కువగా చూడటం తనకు నచ్చలేదు అంతే అని సుభాష్ వివరించి చెబుతాడు. మీ లాజిక్స్ నా కోపాన్ని చల్లార్చలేవండి అని అపర్ణ వెళ్లి పోతుంది. నా పరిస్థితే ఇలా ఉందంటే.. నా తమ్ముడి పరిస్థితి ఎలా ఉంటుందో అని తలచుకుంటాడు సుభాష్. కట్ చేస్తే.. ప్రకాష్ ల్యాప్ ట్యాప్ పాస్ వర్డ్ ఏంటబ్బా అని మర్చిపోతూ ఉంటాడు. ధాన్య లక్ష్మిని చూడగానే.. హా పిచ్చి మాలోకం పాస్ వర్డ్ గుర్తు వచ్చి టైప్ చేస్తాడు. అప్పుడే ధాన్య లక్ష్మి తనలో ఉన్న కోపాన్ని వెళ్లగక్కుతుంది. ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే పని లేదా.. మీ వదినా రాజ్‌ని వేరుగా, కళ్యాణ్‌ని వేరుగా చూస్తుందండీ అని చెప్తుంది. మీ వదినా ఏంటి? కొత్తగా.. ఇంతకు ముందు అక్కా అని పిలిచేదానివి కదా అని ప్రకాష్ చిర్రుబుర్రులాడుతూ ఉంటాడు. ఆవిడ కళ్యాణ్‌ని బానిసలా చూస్తుంది. రాజ్‌కి ఎప్పుడైనా పని చెప్తుందా.. కళ్యాణ్‌కే చెప్తుందని ధాన్య లక్ష్మి అంటే.. ఇప్పుడేమీ కొత్తగా చెప్పడం లేదు కదా.. ఇప్పుడేమైంది అని ప్రకాష్ అడుగుతాడు. కళ్యాణ్‌కు పెళ్లి అయింది. భార్య కూడా వచ్చిందని ధాన్య లక్ష్మి అంటే.. అయితే కొమ్ములు రాలేదు కదా అంటాడు ప్రకాష్.
మందు కొట్టడానికి వెళ్లిన సుభాష్, ప్రకాష్‌లు..
ఇన్నాళ్లూ ఎప్పుడైనా కళ్యాణ్, రాజ్‌ల మధ్య చిన్న మనస్పర్థ అయినా వచ్చిందా? లేదు కదా.. ఆ తర్వాత కూడా వాళ్లిద్దరూ అలాగే ఉంటారని ప్రకాష్ అంటాడు. ఇది ఎంత వరకూ వెళ్తుందో.. ఎక్కడికి దారి తీస్తుందో చూస్తాను అని చెప్తుంది ధాన్య లక్ష్మి. దీంతో బయటకు వస్తాడు ప్రకాష్. అక్కడ మెట్ల దగ్గర కూర్చుంటాడు సుభాష్. ఏరా బాగా అయిందా.. ఆ.. అయింది అన్నయ్యా.. కనీసం నాకు జరిగింది మర్చిపోయే అవకాశం అయినా ఉంది. నీకు అది కూడా లేదు కదా అన్నయ్యా అని ప్రకాష్ జోక్ చేస్తాడు. సర్లే రారా మందు కొడదాం అని ఇద్దరూ వెళ్తారు.
బాధలో ఒంటరిగా నిల్చున్న కావ్య..
మరోవైపు కావ్య బాల్కానీలో ఒంటరిగా నిల్చుని బాధ పడుతూ ఉంటుంది. కావ్య దగ్గరకు వచ్చిన కళ్యాణ్.. ఏంటి వదినా మీకు బాలేదని చెప్పి ఉంటే ఆస్పత్రికి నేనే తీసుకెళ్లే వాడిని కదా అని అంటాడు. లేదు కవి గారూ.. పెద్ద అత్తయ్య మీకు పని చెబితే.. చిన్న అత్తయ్య ఏదో అన్నారంట కదా.. స్వప్న అక్క చెప్పింది. నేనూ కూడా ఆస్పత్రికి తీసుకెళ్తాను అంటే నన్ను కూడా ఏదో అనేవారని కావ్య అంటుంది. ఈ ఇంట్లో అందరూ పెద్దరికాన్ని అవివేకం మింగేస్తుంది. మన కుటుంబం నుంచి నా కుటుంబం అనే వరకూ వచ్చారు. కొడుక్కి పట్టాభిషేకం చేద్దామనుకున్న కైకేయి పరిస్థితి ఏమైందో తెలిసి కూడా మా అమ్మ మారిపోతుంది. అది చూస్తుంటే భయం వేస్తుంది. ఇలాంటి భేధాభిప్రాయాలు చూస్తే టెన్షన్‌గా ఉంది.
కావ్యకు శ్వేత గురించి చెప్పిన కళ్యాణ్..
సరే ఆ సంగతి వదిలేయండి వదినా.. మీరేంటి అలా ఉంటున్నారు? నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి అని అడుగుతాడు కళ్యాణ్. అదేం లేదు మీ అన్నయ్య గురించి ఎవరూ తక్కువగా అనుకోకూడదు అని. అన్నయ్య ఎప్పుడూ తప్పు చేయడు కదా అని కళ్యాణ్ అడుగుతాడు. అప్పుడే శ్వేత గురించి అడుగుతుంది కావ్య. ఈ అమ్మాయి శ్వేత కదా. తను అన్నయ్య క్లాస్ మేట్ అని అంటాడు కళ్యాణ్. మరి వాళ్లిద్దరీ పరిచయం ఎలాంటిది అని అడుగుతుంది కావ్య. అప్పుడే ఏదో జరిగి పోయింది వదినా.. శ్వేత అన్నయ్యని ప్రేమించింది. కానీ అన్నయ్య ఒప్పుకోలేదని చెప్తాడు కళ్యాణ్. మరి ఇప్పుడు ఎందుకు వాళ్లిద్దరూ కలిసి తిరుగుతున్నారు? నేను చాలా సార్లు చూశాను కవి గారూ అని కావ్య అంటుంది. అప్పుడే కావ్య, కళ్యాణ్‌లను చూసిన అనామిక.. ఇంత రహస్యంగా వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అని వెళ్తుంది.
రెచ్చగొట్టిన రుద్రాణి.. టెన్షన్‌లో అనామిక..
సరే ఈ విషయం గురించి ఇంట్లో ఎవరి గురించీ చెప్పకండి. నిజానిజాలు తెలుసుకోకుండా మీ అన్నయ్యని దోషిగా నిలబెట్టడం నాకు ఇష్టం లేదని అంటుంది కావ్య. అసలు అన్నయ్యా అని ఆపేస్తాడు కళ్యాణ్. అనామిక వచ్చి ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. ఏమీ లేదని అక్కడి నుంచి వెళ్లి పోతుంది కావ్య. నువ్వు కూడా చెప్పవా అని అంటే.. కవితల గురించి అని చెప్పి వెళ్లిపోతాడు కళ్యాణ్. అప్పుడే వచ్చిన రుద్రాణి.. ఏంటి గొడవ చేయకుండా వదిలేసావ్ అని అంటుంది. అదేంటి? అందులో గొడవ చేయడానికి ఏముందని అనామిక అడుగుతుంది. నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావ్ కాబట్టే.. ఆ కావ్య ఇష్టం వచ్చినట్టు డ్రామాలు చేస్తుంది. నీకు తెలీదు.. మీ ఇద్దర్నీ విడగొట్టాలని ట్రై చేస్తుంది అని చెప్తుంది రుద్రాణి. ఎవరు ఏం చేసినా మా ఇద్దర్నీ ఎవరూ విడగొట్టలేరని అనామిక అంటే.. నువ్వు పిచ్చిదానివి.. నీ మీద లేని పోనివి చెప్పి.. కళ్యాణ్ మనసు విరగొట్టి.. వాళ్ల చెల్లికి దగ్గర చేసి పెళ్లి కూడా చేసేస్తుంది. అప్పుడు రాణిలా ఈ ఇంటిని ఏలుతుందని అంటుంది రుద్రాణి. ఈ మాటలకు ఆలోచనలో పడి టెన్షన్ పడుతుంది అనామిక. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.