Brahmamudi, January 22nd episode: శ్వేతపై ఎటాక్.. కావ్య గుండెల్లో అగ్ని గుండెం.. స్వప్న పశ్చాత్తపం!
ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్‌లో ధాన్య లక్ష్మి కూరగాయాలు కట్ చేస్తూ ఉంటుంది. ధాన్య లక్ష్మిని చూసిన అనామిక, రుద్రాణి ప్లాన్ చేస్తారు. రుద్రాణి వెళ్లి.. కావాలనే ధాన్య లక్ష్మితో కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. ఇన్నాళ్లు అంటే చిన్నవాడు.. కానీ ఇప్పుడు పెళ్లి అయింది. తనను నమ్ముకుని అనామిక వచ్చిందని అంటుంది. కానీ ధాన్య లక్ష్మి పట్టించుకోదు. ఇదంతా అనామిక దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. కళ్యాణ్ అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే.. అనామిక ఏమీ అనుకోదా అని రుద్రాణి అంటే..
ఈ రోజు బ్రహ్మ ముడి ఎపిసోడ్‌లో ధాన్య లక్ష్మి కూరగాయాలు కట్ చేస్తూ ఉంటుంది. ధాన్య లక్ష్మిని చూసిన అనామిక, రుద్రాణి ప్లాన్ చేస్తారు. రుద్రాణి వెళ్లి.. కావాలనే ధాన్య లక్ష్మితో కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. ఇన్నాళ్లు అంటే చిన్నవాడు.. కానీ ఇప్పుడు పెళ్లి అయింది. తనను నమ్ముకుని అనామిక వచ్చిందని అంటుంది. కానీ ధాన్య లక్ష్మి పట్టించుకోదు. ఇదంతా అనామిక దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది. కళ్యాణ్ అలా ఇంట్లో తిరుగుతూ ఉంటే.. అనామిక ఏమీ అనుకోదా అని రుద్రాణి అంటే.. నా కోడలు అలా ఏమీ అనుకోదు. తను బంగారమని అంటుంది. మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. కళ్యాణ్ అలానే ఉంటే అనామికకు తప్పకుండా విసుగు వస్తుందని రుద్రాణి చెప్పి వెళ్లి పోతుంది.
ధాన్య లక్ష్మిలో అనుమానం విత్తనం నాటిన అనామిక, రుద్రాణి..
పక్కకు వచ్చి అనామిక ఏంటంటా అని అడుగుతుంది. నువ్వు చెప్పినట్టే అనుమానం అనే విత్తనం నాటాను అని రుద్రాణి అంటుంది. దానికి మనం బలాన్ని ఇవ్వాలి అని అనామిక అంటుంది. పిచ్చిదానా.. కళ్యాణ్‌ని అడ్డం పెట్టుకుని రాహుల్‌కి కూడా ఆస్తిలో వాటా వచ్చేలా చేసుకుంటున్నా అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే.. రాజ్ ఆఫీస్‌కి వెళ్లడానికి రెడీ అవుతాడు. అప్పుడే శ్వేత కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రాజ్‌కి.. శ్వేత కంగారుగా సేవ్ మీ.. సేవ్ మీ అని అంటుంది. వెంటనే రాజ్ గది నుంచి వెళ్లి పోతాడు. రాజ్ అలా కంగారుగా వెళ్లడాన్ని కావ్య గమనిస్తుంది.
కావ్య లేకపోతే నా భుజం విరిగిపోయినట్టు ఉందన్న కృష్ణ మూర్తి..
ఈ సీన్ కట్ చేస్తే.. కనకం, కృష్ణ మూర్తిలు బయట కూర్చుంటారు. ఈలోపు కాంట్రాక్టర్ వచ్చి.. పని గురించి అడుగుతాడు. ఎందుకయ్యా వాళ్లతో మాటలు పడతావ్.. ఆ పని మొదలు పెట్టొచ్చుగా అని కనకం అంటే.. అవును కానీ మనసు మనసులో లేదు. కావ్య నాకు ఒక కొడుకులా తోడుగా నిలిచింది. అది అత్తారింటికి వెళ్లి పోయినప్పటి నుంచి నా భుజం విరిగి పోయినట్టుగా ఉంది. కానీ ఎందుకో ఏకాగ్రత కుదరడం లేదని కృష్ణ మూర్తి బాధ పడతాడు. చేయని తప్పుకు మాటలు పడటం వల్ల మనసు గజి బిజిగా మారింది. ఇంకేం ఆలోచించకు మూర్తి. అన్నీ మర్చిపోయి.. పనీలోపడితే నీకే మనసు శాంతిగా ఉంటుందని అన్న పూర్ణ అంటుంది.
రాజ్ గురించి ఆలోచించి.. కళ్లు తిరిగి పడిపోయిన కావ్య..
హాలులో ఇందిరా దేవి, స్వప్న, కావ్య ఉంటారు. కావ్య రాజ్ గురించి ఆలోచిస్తూ కళ్లు తిరిగి పడిపోతుండగా.. స్వప్న లేచి పట్టుకుని కావ్యా.. ఏమైందే అని పట్టుకుంటుంది. కావ్య తేరుకుంటుంది. ఎందుకు అంత నీరసంగా కనిపిస్తున్నావ్.. అని స్వప్న అడిగితే.. ఎందుకు ఉండదు చెప్పు.. పెళ్లి పనులు మొదలు పెట్టినప్పటి నుంచి క్షణం ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నావ్ అని ఇందిరా దేవి అంటుంది. ఒకసారి ఆస్పత్రికి వెళ్లడం మంచిది అనిపిస్తుంది అమ్మమ్మా అని స్వప్న అంటే.. అమ్మా కావ్య.. ఒకసారి రాజ్‌కి కాల్ చేసి రమ్మని చెప్పు అని పెద్దావిడ అంటే.. వద్దని కావ్య అంటుంది.
ప్రమాదంలో శ్వేత.. కాపాడిన రాజ్.. కావ్య కన్నీళ్లు..
మరోవైపు రాజ్.. శ్వేత దగ్గరకు వస్తాడు. కావ్య కాల్ చేసినా.. రాజ్ లిఫ్ట్ చేసి పనిలో ఉన్నానని చెప్పి పెట్టేస్తాడు. పదా వెళ్దాం అని కావ్యని స్వప్నని ఆస్పత్రికి తీసుకెళ్తుంది. రాజ్ తలుపు తీసే సరికి శ్వేత చేయి కట్ చేసి, స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. షాక్ అయిన రాజ్.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్తాడు. ఇటు స్వప్న కూడా కావ్యని ఆస్పత్రికి తీసుకెళ్తుంది. కావ్య డల్‌గా ఉండటం చూసి.. నువ్వూ రాజ్ ఏమైనా గొడవ పడ్డారా? నువ్వు పిలిస్తే రాజ్ రాకుండా ఉంటాడా అని స్వప్న అడుగుతుంది. అదేం లేదక్కా అని కావ్య అంటుంది. నిజంగానే రాజ్ చాలా గొప్పవాడే.. నేను మోసం చేసినా కూడా నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని స్వప్న అంటే.. అవును అక్కా.. నిశ్శబ్దంగా ఏడ్చే కన్నీళ్లు.. గొడవలతో అలసి పోయిన మా మనసులు ఇవే మా కాపురానికి సాక్ష్యాలు. మనసు ఉన్నవాడే దొరికినా.. ఆ మనసును గెలుచుకోవడంలో నేను ఓడి పోయాను అని మనసులో కావ్య అనుకుంటూ.. బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది కావ్య. మరోవైపు శ్వేతను ఆస్పత్రికి తీసుకెళ్తూ ఉంటాడు రాజ్.
రాజ్, శ్వేతలను ఆస్పత్రిలో చూసి కృంగిపోయిన కావ్య..
కావ్యను డాక్టర్ దగ్గరకి తీసుకెళ్తుంది స్వప్న. బీనీ డౌన్ అవ్వడం తప్ప ఎలాంటి కాంప్లికేషన్స్ కనిపించడం లేదని డాక్టర్ అంటుంది. మరోవైపు కావ్య రాజ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక స్వప్న అత్తారింటి గురించి మొత్తం చెప్పేస్తుంది. మా చెల్లికి పుట్టింట్లో సుఖం లేదు. అత్తారింట్లో కూడా సుఖం లేదు. టైమ్ కి తినదు.. నిద్ర పోదని స్వప్న చెప్తుంది. మీరు ముందు రెస్ట్ తీసుకోవాలి. ఫుడ్ తినాలి. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదని డాక్టర్ చెబుతుంది. సరిగ్గా అప్పుడే కావ్యకు రాజ్, శ్వేతలు కనిపిస్తారు. వాళ్లను చూసిన కావ్య.. షాక్ అవుతుంది. ఈలోపు స్వప్నని రిపోర్ట్స్ కోసం వెళ్లగానే.. కావ్య రాజ్ కోసం వెళ్తుంది. అక్కడ బయటకు వచ్చిన సిస్టర్స్.. ఏదో చిన్న గాయం అయింది. పక్కన ఉన్నది కాబోయే మొగుడు అంట.. ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా అని అనుకుంటూ ఉంటారు. అది విన్న కావ్య.. ఇంకా కృంగిపోతుంది.