Brahmamudi, January 19th episode: మొదటిసారి కావ్యకు స్పప్న హితబోధ.. శ్వేత ఇంట్లోకి చొరబడిన వ్యక్తి!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. హాలులో ఉన్న కావ్యని చూస్తుంది స్వప్న. ఇప్పటివరకూ ఏం చేస్తున్నావ్ ఇక్కడ? పని మనిషి ఏమైందని అడుగుతుంది. పని మనిషి ఇప్పటి దాకా ఎందుకు ఉంటుందని కావ్య అంటుంది. అయితే నువ్వు చేస్తావా.. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో పని చేస్తూనే ఉంటావ్.. ఇలా చేసుకుంటూ పోతే నీతో బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయిస్తారు. ఈ ఇంట్లో నీకు ఎవరైనా గౌరవం ఇస్తున్నారా.. నువ్వు మాత్రం అన్ని పనులూ చేస్తున్నావ్.. అని స్పప్న అంటే.. మన పనే కదా అక్కా..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. హాలులో ఉన్న కావ్యని చూస్తుంది స్వప్న. ఇప్పటివరకూ ఏం చేస్తున్నావ్ ఇక్కడ? పని మనిషి ఏమైందని అడుగుతుంది. పని మనిషి ఇప్పటి దాకా ఎందుకు ఉంటుందని కావ్య అంటుంది. అయితే నువ్వు చేస్తావా.. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో పని చేస్తూనే ఉంటావ్.. ఇలా చేసుకుంటూ పోతే నీతో బాత్రూమ్స్ కూడా క్లీన్ చేయిస్తారు. ఈ ఇంట్లో నీకు ఎవరైనా గౌరవం ఇస్తున్నారా.. నువ్వు మాత్రం అన్ని పనులూ చేస్తున్నావ్.. అని స్పప్న అంటే.. మన పనే కదా అక్కా.. చేస్తే ఏమైంది? ఎవరి మొప్పు కోసమే ఇదంతా చేస్తున్నావ్? అమ్మమ్మ గారు తప్ప.. ఇంట్లో ఉన్న ఆడమందంతా నిన్ను మనిషిలా చూస్తున్నారా.. ఎప్పుడు సంధు దొరుకుతుందా.. ఎప్పుడు అందామా అని చూస్తున్నారు. మాట పడితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసే.. ఇప్పుడు మీ అత్తగారికి తోడు.. చిన్న అత్తయ్య కూడా తయారైంది.
ఎదురు తిరగవే.. ఎన్నాళ్లు ఇలా ఉంటావ్..
ఇక ఆమె కోడలు అయితే చిత్రాంగిలా తయారైంది. నిన్న గాక మొన్న వచ్చింది కూడా ఆ అనామిక కూడా అనేంత స్థాయికి వచ్చింది. వాళ్లేమో పట్టు చీరలు కట్టుకుని.. నగలు పెట్టుకుని తిరుగుతారు. నువ్వేమో పని మనిషిలా పాత చీరలు కట్టుకుని ఉంటావ్.. ఎందుకే నీకు ఇదంతా.. ఒక్కసారి ఎదురు తిరిగి మాట్లాడవే అందరూ సైలెంట్ అయిపోతారు. నిన్ను ఒక్క మాట అనాలన్నా భయ పడతారు అని కావ్యకు హితబోధ చేస్తుంది స్వప్న. అయినా కావ్య పట్టించుకోకుండా.. అందరూ మన వాళ్లే.. మనం ఈ ఇంట్లోనే కదా ఉంటున్నాం. సర్దుకుపోవాలి అని అంటుంది. నీకు చెప్పాను చూడు నన్ను నేను అనుకోవాలి అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది స్వప్న.
మూడోదాన్ని కూడా దుగ్గిరాల ఇంటికి పంపించాలని చూశారంట కదా..
ఈ సీన్ కట్ చేస్తే.. కనకం, కృష్ణమూర్తిలు భోజనం చేసి కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే పక్కింటి ఆవిడ శాంత వస్తుంది. తన కూతురు పెళ్లి ఫిక్స్ అయిందని, కార్డ్ ఇవ్వడానికి వచ్చినట్టు చెప్తుంది. పెళ్లి కొడుకు ఏం చేస్తాడని అడిగితే.. ఏదో చిన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని నీరసంగా చెబుతుంది శాంత. సాఫ్ల్ వేర్ ఉద్యోగి కదా అంత నీరసంగా చెప్తావేం అని అన్నపూర్ణ అంటుంది. ఎంత సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా.. కనకం అక్క అల్లుళ్లతో పోలిస్తే ఎంత అని శాంత అంటుంది. అదేంటే అలా అంటున్నావ్ అని కనకం అంటే.. మరి ఇద్దరి మంచి అల్లుళ్లని పట్టావ్.. ఇప్పుడు మూడోదాన్ని కూడా ప్రేమ పేరుతో చెప్పి ఆ ఇంటి అబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకున్నావంట కదా. మన కాలనీలో అందరూ మాట్లాడుకుంటున్నారని అంటుంది. శాంత మాటలు విని లోపల అప్పూ కూడా బాధ పడుతుంది. ఆ మాటలకు కనకం, కృష్ణ మూర్తిలు బాధ పడి అక్కడి నుంచి వెళ్లి పోతారు. అన్న పూర్ణ.. శాంతని తిట్టి పంపించేస్తుంది.
లేనోళ్లు.. ఉన్నోళ్లను ప్రేమిస్తే..ఆశే కనిపిస్తుంది..
కావ్య పనంతా చేసుకుని గదిలోకి వచ్చేసరికి రాజ్ పడుకుంటాడు. దీంతో కావ్య కూడా పడుకుంటుంది. మరోవైపు అప్పూకి భోజనం తీసుకెళ్లి పెడుతుంది అన్నపూర్ణ. తినాలని లేదు.. ఆకలి లేదు పెద్దమ్మా అని అప్పూ అంటుంది. మనసు బాగోలేదని చెప్పు అప్పూ.. నిజమేంటో నీకు తెలుసు. వాళ్ల మాటలు విని నువ్వెందుకు బాధ పడుతున్నావ్. అలా వాళ్లు అనేలా మనమే చేసుకున్నాం. అటు ఆ ఇంట్లో కూడా మీ అమ్మ నమ్మకం కోల్పోయింది. మీ అక్కల కోసం అబద్ధాలు ఎక్కువ చెప్పింది. అందులో తన స్వార్థం కూడా లేదు. మీరు బాగుండాలనే తను ప్రయత్నించిందని అన్న పూర్ణ అంటే.. మధ్య తరగతి వాళ్లు ప్రేమించకూడదా.. ఆస్తి ఉన్నవాళ్లే నిజాయితీగా ప్రేమిస్తారా అని అప్పు అడుగుతుంది. లేనోళ్లు.. ఉన్నోళ్లను ప్రేమిస్తే.. ఆశ కనిపిస్తుందే తప్ప.. ప్రేమ కనిపించదని సర్ది చెబుతుంది అన్న పూర్ణ.
శ్వేత ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. భయాన్ని పరిచయం చేసాడుగా..
ఈలోపు కావ్య, రాజ్ గదిలో అలారం మోగుతుంది. రాజ్ లేచి రెడీ అవుతూ ఉంటాడు. అదేంటి? ఇప్పుడు ఎక్కడికి అని కావ్య అడుగుతుంది. డిజైన్స్ ఫైనల్ చేయాలి? వెళ్తున్నా. రెండు గంటలు పడుకుంటే తల నొప్పి రాదని పడుకున్నా అని రాజ్ చెప్తాడు. మీరు ఒక్కరేనా.. లేక ఆఫీస్ వాళ్లు కూడా వస్తున్నారా అని కావ్య అడిగితే.. టీమ్ వర్క్ కదా.. వాళ్లు కూడా రావాలి అని చెప్పి వెళ్లి పోతాడు. మరోవైపు శ్వేత పడుకుని ఉంటుంది. ఇంట్లోకి ఎవరో వచ్చి.. చప్పుళ్లు చేయడం.. టీవీ పెట్టడం చేస్తూ ఉంటారు. దీంతో శ్వేత భయ పడుతుంది. అప్పుడే శ్వేతకి రాజ్ కాల్ చేస్తాడు. సాయంత్రం మెసేజ్ పెట్టావ్? కదా.. ఇప్పుడే చూశాను అని అంటాడు. శ్వేత కంగారుగా మాట్లాడుతుంది. ఏమైందని అడగ్గా.. శ్వేత చెబుతుంది. దాంతో రాజ్ నేను వస్తాను అని అంటాడు. వద్దని శ్వేత అంటుంది. లోపలికి చొరబడిన వ్యక్తి ఇంట్లో చప్పుళ్లు చేస్తూ శ్వేతని భయపెడతాడు. దీంతో శ్వేత ఒక కర్ర పట్టుకుని ఉంటుంది. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.